బ్రహ్మోత్సవం కంటే దారుణంగా పెదకాపు1.. ఇది ఆయనకే సాధ్యం

బ్రహ్మోత్సవం కంటే దారుణంగా పెదకాపు1.. ఇది ఆయనకే సాధ్యం

క్లాసిక్ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల(Srikanth addala) తెరకెక్కిచిన లేటెస్ట్ మూవీ పెదకాపు1(Pedakapu1). రూరల్ అండ్ పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాతో కొత్త కుర్రాడు విరాట్ కర్ణ(Virat karrna) హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి నెగిటీవ్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమా బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. 

ఇప్పటివరకు శ్రీకాంత్ అడ్డాల కెరీర్ లో బిగ్గెస్ట్ ప్లాప్ అంటే మహేష్ బాబు హీరోగా వచ్చిన బ్రహ్మోత్సవం అనే చెప్పాలి. కేవలం శ్రీకాంత్ కే కాదు మహేష్ బాబు కెరీర్ లో కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది ఈ సినిమా. అయితే ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసింది పెదకాపు 1 సినిమా.  బాక్సాఫీస్ వద్ద బ్రహ్మోత్సవం కంటే భారీ స్థాయిలో నష్టాలను తెచ్చిపెట్టనుంది పెదకాపు 1 సినిమా. 

ఈ సినిమా రిలాజై వారం గడుస్తున్నా.. సినిమాకు పెట్టిన పెట్టుబడికి,థియేట్రికల్ బిజినెస్ లో ఇప్పటివరకు కనీసం ఒక ఐదు శాతం కూడా కలెక్ట్ చేయలేకపోయింది. దాదాపు రూ.13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా.. అందులో కనీసం కోటి రూపాయల షేర్ ను కూడా రాబట్టలేకపోయిందని సమాచారం. దీంతో పెదకాపు 1 సినిమా బ్రహ్మోత్సవం సినిమా ప్లాప్ రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. ఇక ఈ వార్త తెలుసులకున్న నెటిజన్స్ ఇలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయాలంటే శ్రీకాంత్ అద్దాలకే సాధ్యం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఫుల్ రన్ ఈ సినిమా ఎన్ని కోట్ల నష్టం తీసుకురానుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.