పెదకాపు 1 టీజర్ వచ్చేసింది.. పొలిటికల్ బ్యాక్డ్రాప్ వర్కౌట్ అయ్యేలాగే ఉంది!

పెదకాపు 1 టీజర్ వచ్చేసింది.. పొలిటికల్ బ్యాక్డ్రాప్ వర్కౌట్ అయ్యేలాగే ఉంది!

కొత్త బంగారు లోకం(Kotha bangaru lokam) ఫేమ్ శ్రీకాంత్ అడ్డాల(Srikanth addala) దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ పెదకాపు 1(Pedakapu1). రూరల్ అండ్ పొలిటికల్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాతో విరాట్ కర్ణ(Virat karna) హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ ఇంటెన్స్‌ అండ్ పవర్‌ఫుల్‍గా కట్ చేశాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. గ్రామాల్లో ఉండే వర్గ పోరు, రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని టీజర్ చూస్తే  అర్థమవుతోంది.

సీనియర్ ఎన్టీఆర్(ntr) తెలుగు దేశం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఇచ్చిన రాజకీయ ప్రసంగంతో ఈ టీజర్ మొదలైంది. ఆ తరువాత తనికెళ్ల భరణి(Thanikella Bharani) చెప్పిన “ఏ ఊరికైనా నాలుగు దిక్కులు ఉంటాయి కానీ.. ఈ ఊరికి మాత్రం రెండే దిక్కులు ఉంటాయి” అంటూ చెప్పిన డైలాగ్ సినిమాపై ఇంట్రెస్ట్ పెంచింది. ఇక ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న హీరో విరాట్ కర్ణ ఇంటెన్స్ లుక్స్ కూడా చాలా బాగున్నాయి. రూరల్ బ్యాక్డ్రాప్ కథకు బాగా సెట్ అయ్యాడు. ఇక ఈ టీజర్ కు మెయిన్ హైలెట్ అంటే మిక్కీ జే మేయర్(Micky j mayer) అందించిన మ్యూజిక్ అని చెప్పాలి. తన మ్యూజిక్ తో టీజర్ ను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాడు మిక్కీ.

 ఇక నాగబాబు(Nagababu), తనికెళ్ల భరణి, రావు రమేశ్(Rao Ramesh), రాజీవ్ కనకాల(Rajeev kanakala), ఈశ్వరీ(Eshwari), అనసూయ(Anasuya) కీలక పాత్రల్లో కనిపిస్తున్న.. ఈ సినిమాలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కూడా కీలక పాత్రలో అలరించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా.. ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.