
- ఎవరికి వారుగా చీలిన లీడర్లు
- ప్రోగ్రాం ఏదైనా సొంతంగానే ముందుకు
- ఎవరి వెనుక నడవాలో కన్ఫ్యూజన్లో క్యాడర్
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్‌లో వర్గపోరుతో లీడర్లు రోడ్డెక్కుతున్నారు. ఇప్పటి నుంచే టిక్కెట్మాదే అంటే మాదే అని బహిరంగంగా ప్రకటించుకుంటున్నారు. దీంతో జిల్లాలో ఎవరి వెనుకాల నడవాలో అర్థంకాక క్యాడర్కన్ఫ్యూజన్లో ఉంది.
పార్టీలో వర్గపోరు
పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్‌లో వర్గపోరు నడుస్తోంది. పెద్దపల్లి నియోజకవర్గంలో తనకే టికెట్వస్తుందని లీడర్లు ఎవరికివారు ధీమాగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నిర్వహిస్తున్న రచ్చబండ ప్రోగ్రాంను నియోజవర్గంలో మాజీ ఎమ్మెల్యే విజయరమణరావు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా డీసీసీ ప్రమేయం లేకుండా పార్టీలోకి చేరికలను ప్రోత్సహిస్తున్నారని కొమురయ్య వర్గం విజయరమణారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఓదెల జడ్పీటీసీ గంటరాములు చింతన్ బైఠక్ తీర్మానాల దృష్ట్యా టిక్కెట్ తనకే వస్తుందని ఆశిస్తున్నారు. విజయరమణరావు పీసీసీ ప్రెసిడెంట్రేవంత్రెడ్డిని నమ్ముకుంటే, గంట రాములు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి సీనియర్లను నమ్ముకున్నారు. డీసీసీ అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య మాత్రం కాంగ్రెస్‌లో తానే సీనియర్‌నని, సీటు తనకేనన్న ఆశతో ఉన్నారు. ఇలా గ్రూపులుగా విడిపోయి, వేర్వేరుగా ప్రోగ్రామ్ లు చేస్తున్నారు. దీంతో క్యాడర్డైలమాలో పడిపోయింది. ఎన్నికల నాటికి ఇదే విధంగా ఉంటే పార్టీ మరోసారి దెబ్బతినక తప్పదని ఆ పార్టీ నాయకులే చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014 లో మొదటిసారి జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ నుంచి ముకుందరెడ్డి టికెట్రేసులో ఉన్నారు. అనూహ్యంగా భానుప్రసాదరావు టికెట్దక్కించుకున్నారు. టికెట్‌దక్కని ముకుందరెడ్డి కొంతకాలానికి మరణించారు. టికెట్ రాకపోవడం వల్లనే ఆయన చనిపోయారన్న అసంతృప్తి క్యాడర్లో గూడుకట్టుకుంది. ఇదే ఆ ఎలక్షన్లో ఓటమికి కారణమైందని విశ్లేషణలున్నాయి.
2018 ఎలక్షన్లోనూ అదే తీరు..
2014లో ఓడిపోయిన భానుప్రసాదరావు టీఆర్ఎస్లో చేరారు. టీడీపీ నుంచి ఓడిపోయిన విజయరమణారావు కాంగ్రెస్‌లో చేరారు. ముకుందరెడ్డి కోడలు సవితరెడ్డి, గొట్టిముక్కుల సురేశ్ రెడ్డి, ఈర్ల కొమురయ్యతో పాటు పలువురు సీనియర్లు 2018లో టికెట్ ఆశించారు. కానీ హైకమాండ్ విజయరమణారావును బరిలో నిలిపింది. దీంతో ముగ్గురు నాయకులు హైకమాండ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. సవితారెడ్డి, సురేశ్‌రెడ్డి పార్టీ క్యాండెట్అయిన విజయరమణారావుకు వ్యతిరేకంగా పనిచేశారు. ఇప్పుడు అంతకన్నా తీవ్రంగా గ్రూప్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. కాంగ్రెస్ బలం పుంజుకుంటున్న క్రమంలో చాలా మంది టికెట్లు ఆశిస్తున్నారు. పెద్దపల్లి పరిస్థితిపై హైకమాండ్ఫోకస్ చేయాలని, జరుగుతున్న పరిణామాలకు చెక్ పెట్టాలని లీడర్లు, క్యాడర్ కోరుతున్నారు. రామగుండం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మక్కాన్‌సింగ్ టిక్కెట్తనదే అనే ధీమాతో ఉన్నారు. 2018 లో రామగుండం నియోజకవర్గంలో మక్కాన్సింగ్రాజ్ ఠాకూర్‌కు కాంగ్రెస్‌లో ఎవరూ పోటీ లేరు. కానీ ప్రస్తుతం ఐన్టీయూసీ లీడర్జనక్ ప్రసాద్‌తో పాటు హర్కర వేణుగోపాల్‌లు పోటీ పడుతున్నారు. కొద్దిరోజుల క్రితం రామగుండం కార్పొరేటర్లు కొందరు సమావేశాలు పెట్టి తామంతా ఠాకూర్ వెనుకున్నామని హైకమాండ్‌కు ఇండికేషన్ఇచ్చారు. మరోవైపు జనక్ప్రసాద్వర్గం సైతం మీటింగ్‌లు పెడుతోంది. మంథనిలో శ్రీధర్ బాబుకు పోటీ లేకపోవడంతో ఆయన తన పని మీద ఫోకస్ చేశారు.