ఎంపీగా గెలిపిస్తే..పెద్దపల్లి, బెల్లంపల్లి ప్రాంతాలను అభివృద్ది చేస్తా: గడ్డం వంశీకృష్ణ

ఎంపీగా గెలిపిస్తే..పెద్దపల్లి, బెల్లంపల్లి ప్రాంతాలను అభివృద్ది చేస్తా: గడ్డం వంశీకృష్ణ

పెద్దపల్లి, బెల్లంపల్లి ప్రాంతాలు చాలా వెనకబడి ఉన్నాయి..ఎంపీగా గెలిచిన వెంటనే ఈ ప్రాంతాలను అభివృద్ధికి పనిచేస్తానన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. బెల్లంపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వంశీకృష్ణకు డప్పు చప్పుల్లతో స్థానికులు ఘనస్వాగతం పలికారు. యువత డిగ్రీలు, పీజీలు చేసి ఆటో నడుపుతూ.. జీవనం సాగిస్తున్నారు. నిరుద్యోగ సమస్య అధికంగా ఉంది.. పదేళ్లలో గత ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాల ఇవ్వకుండా మోసంచేసిందన్నారు వంశీకృష్ణ. 

తెలంగాణ వచ్చాక బీఆర్ ఎస్ ప్రభుత్వంలో ప్రజలను దోచుకుతిన్నారని ఆరోపించారు వంశీకృష్ణ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను నిలబెట్టుకుందన్నారు. ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదు నెరవేర్చిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కల్పించిందన్నారు. 

బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ అభివృద్ది 30 ఏండ్లు వెనకకు వెళ్లిందన్నారు వంశీకృష్ణ. ఎంపీగా గెలిచిన వెంటనే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి బెల్లంపల్లి, పెద్దపల్లి నియోజకవర్గాల్లోఅభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలో ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించేలాగా చేస్తానని పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని కాంగ్రెస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి  వంశీకృష్ణ కోరారు.