భూసార పరీక్ష కేంద్రాన్ని రైతులు వినియోగించుకోవాలి : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

భూసార పరీక్ష కేంద్రాన్ని  రైతులు వినియోగించుకోవాలి : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  • ఎంపీ గడ్డం వంశీకృష్ణ 

ధర్మారం, వెలుగు: ధర్మారం మండలం పత్తిపాక క్రాస్ రోడ్డు వద్ద గంధం ప్రశాంత్ ఏర్పాటు చేసిన భూసార పరీక్షా కేంద్రాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ శనివారం ప్రారంభించారు.  ఈ సందర్భంగా గంధం ప్రశాంత్‌‌‌‌‌‌‌‌ను ఎంపీ అభినందిస్తూ  రైతులు ఈ కేంద్రాన్ని ఉపయోగించుకొని, నేలసారం అనుగుణంగా పంటలు వేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ వెంట ధర్మారం మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 

మృతుల కుటుంబాలకు ఎంపీ పరామర్శ 

గోదావరిఖని, వెలుగు : గోదావరిఖని లక్ష్మీనగర్​ నివాసి, వ్యాపారి శ్యామ్​సుందర్​ శర్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ శనివారం వారి నివాసానికి వెళ్లి శర్మ చిత్రపటం వద్ద పూలు వేసి నివాళులర్పించారు. శర్మ కుమారుడైన కంజుమర్స్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్ శర్మ, ఇతర కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.

 ఎంపీ వెంట రామగుండం లయన్స్​ క్లబ్​ ప్రెసిడెంట్​ పి.మల్లికార్జున్​, లీడర్లు కామ విజయ్, జావిద్, తిప్పారపు మధు, గడ్డం మధు, దినేశ్, శ్రావణ్, రాజశేఖర్, తదితరులున్నారు. స్థానిక మార్కండేయకాలనీలో ఎంపీ గడ్డం వంశీకృష్ణను రామగుండం కార్పొరేషన్​ కో ఆప్షన్​ మెంబర్​ ఎండీ రఫిక్​, రామగుండం లయన్స్​ క్లబ్​ ప్రతినిధులు బంక రామస్వామి, కె.రాజేందర్​ శాలువాలతో 
సత్కరించారు. 

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన దళిత సంఘం నాయకుడు బొంకూరి కైలాసం కుమారుడు బొంకూరి సంతోష్​ (26) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు.   పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ శనివారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి ప్రగాడ సానుభూతి తెలిపారు. మృతుడు సంతోష్​ ఫొటోకు  నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు బాలసాని సతీశ్​, అక్కపాక తిరుపతి, ఈర్ల సురేందర్, గంగుల సంతోష్, భూమయ్య, పెంచాల మల్లయ్య, ఓదెల శ్రీనివాస్​ తదితరులు ఉన్నారు.