బీఫాం చేతికొచ్చేదాకా..అనుమానమే! కన్ఫూజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బీఆర్ఎస్​ క్యాడర్​

బీఫాం చేతికొచ్చేదాకా..అనుమానమే! కన్ఫూజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బీఆర్ఎస్​ క్యాడర్​
  • హైకమాండ్​ను ప్రసన్నం చేసుకునేందుకు రెబల్స్​యత్నాలు
  • రెబల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కేటీఆర్​ ఫొటోలు.. సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో చక్కర్లు
  • అసమ్మతినేతలను కేటీఆర్ ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం
  • టికెట్లు కన్ఫామ్​ అయినా క్యాండిట్లలో తప్పని టెన్షన్​

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​ క్యాండిడేట్లకు బీఫాం టెన్షన్​పట్టుకుంది. టికెట్​కన్ఫాం అయినా బీఫాం చేతికొచ్చేదాకా నమ్మేది లేదని అనుచరుల వద్ద వాపోతున్నట్లు తెలుస్తోంది. హైకమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రసన్నం చేసుకునేందుకు రోజువిడిచి రోజు హైదరాబాద్​చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు రెబల్స్​ కేటీఆర్​తో ఫొటోలు దిగి సోషల్​మీడియాలో అప్​లోడ్​ చేస్తున్నారు. చివరి నిమిషంలో కేటీఆర్​ మనసు మారితే తమకే టికెట్ దక్కుతుందని వారు ప్రచారం చేసుకుంటున్నారు.  టికెట్లు ప్రకటించినా క్షేత్రస్థాయిలో పరిస్థితుల దృష్ట్యా అభ్యర్థులతోపాటు క్యాడర్​ కూడా గందరగోళంలో ఉంది.  

పెద్దపల్లి జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉండగా.. సీఎం కేసీఆర్​ సిట్టింగులకే టికెట్లు ప్రకటించడంతో ఆశావహులు కొంత ఇబ్బంది పడ్డారు. కాగా సిట్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు క్షేత్రస్థాయిలో వ్యతిరేకత ఉండడంతో అధికార పార్టీ లీడర్లు, క్యాడర్ ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మళ్లీ సిట్టింగులు బరిలోకి దిగితే పార్టీ ఓడిపోతుందని బహిరంగంగానే చెబుతున్నారు. కాగా టిక్కెట్​ కన్ఫాం అయిన లీడర్లతోపాటు రెబల్స్​ కూడా ప్రచారం చేసుకుంటుండటంతో క్యాడర్​కన్ఫ్యూజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంది. 

పట్నం చుట్టూ తిరుగుతున్నరు...

టిక్కెట్​ కన్ఫాం అయిన అభ్యర్థులతో పాటు రెబల్స్​కూడా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మకాం వేసి తమ ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ ఓ రెబల్​అభ్యర్థి మంత్రి కేటీఆర్​ కలవగానే మరుసటి రోజే  టిక్కెట్​కన్ఫాం అయిన అభ్యర్థి కూడా కలుస్తున్నారు. టిక్కెట్​ కన్ఫాం అయిన అభ్యర్థులు ప్రజల్లో తిరగాల్సి ఉండగా, ఇంకా రాజధానికి తిరగాల్సి వస్తోందని క్యాడర్​మాట్లాడుకుంటున్నారు. ఆశావహులు ఎవరెవరిని కలుస్తున్నారు.. ఏనిర్ణయం తీసుకుంటున్నారో తెలుసుకునేందుకు వీరంతా హైదరాబాద్ బాట పడుతున్నట్లు తెలుస్తోంది. 

నియోజకవర్గాల్లో ఒకవైపు వ్యతిరేకత ఉండడం, మరోవైపు రెబల్స్​ ఏమేరకు నష్టం చేస్తారోనన్న అనే ఆందోళనతో అభ్యర్థులు ఉన్నారు. మరోవైపు నియోజకవర్గంలో తిరిగితే దళితబంధు, బీసీ బంధుపై ఆశావహులు డైరెక్ట్​గానే నిలదీస్తున్నారు. రెండు స్కీముల్లో 90 శాతం బీఆర్ఎస్​ కార్యకర్తలకే లాభం జరుగుతుండడంతో, సాధారణ ప్రజానీకం తిరగబడుతున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఒకటి, రెండు చోట్ల ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో  తిరగాలంటే అభ్యర్థుల్లో వణుకుపుడుతోంది. 

బీఫాం చేతికొస్తేనే నమ్మేది..

అవినీతి ఆరోపణలు, వ్యతిరేకత ఉన్నప్పటికీ హైకమాండ్​ సిట్టింగులకే టికెట్లు  కన్ఫాం చేసింది. అయినప్పటికీ బీఫాం చేతికొచ్చేదాకా నమ్మేది లేదని అభ్యర్థులతోపాటు క్యాడర్​ భావిస్తున్నారు. గతంలో ఎన్నో సందర్భాల్లో బీఆర్ఎస్​ నుంచి హామీలు పొందినవారికి టికెట్లు దక్కలేదని గుర్తుచేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు గతంలో కంటే తీవ్రంగా ఉన్నాయి. పార్టీలో అసంతృప్తి పెరిగిపోయింది. టిక్కెట్​ ఆశించి భంగపడ్డ లీడర్లు హైకమాండ్​ను ధిక్కరిస్తున్నారు. ప్రకటించిన అభ్యర్థులను మార్చాల్సిందేనని, ఆయా పార్టీల్లో ఉన్న వివిధ కులాలకు చెందిన లీడర్లు కూడా బహిరంగంగానే డిమాండ్​ చేస్తున్నారు.  దీంతో హైకమాండ్ వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నట్లు కనిపిస్తోంది.