
పెద్దపల్లి ప్రజలకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ గుడ్ న్యూస్ చెప్పారు. పెద్దపల్లి ప్రజలు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న రామగుండం ఎయిర్ పోర్టు కల ఇప్పుడు సాకారం కాబోతుందన్నారు. రామగుండంలో ఎయిర్ పోర్టు ఏర్పాటు జరిగితే.. పెద్దపల్లిపార్లమెంట్ ప్రజలకు, సింగరేణి సిబ్బందికి , విద్యార్థులకు , వ్యాపార వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. హైదరాబాద్కు గంటల కొద్దీ ప్రయాణం చేసే అవసరం లేకుండా ప్రత్యక్ష కనెక్టివిటీ ఏర్పడుతుందన్నారు.
రామగుండంలో ఎయిర్ పోర్టు ఏర్పాటు జరిగితే పెద్దపల్లి ప్రాంతంలో ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ది జరుగుతుందన్నారు. కొత్త ఫ్యాక్టరీలు, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయన్నారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఎయిర్ పోర్టు ఏర్పాటుకు సహకరిస్తున్న రాష్ట్రప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తున్నామన్నారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ.
ప్రీ-ఫిజిబిలిటీ స్టడీ పూర్తయిన తరువాత సెంటర్ ఫిజిబిలిటీ స్టడీ ని AAI చేపడుతుందన్నారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. కాకా స్పూర్తితో పెద్దపల్లి ప్రజల కల సాకారం చేసేందుకు రామగుండం ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తయ్యే వరకు అహర్నిశలు కృషి చేస్తానన్నారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. నియోజకవర్గంలోని రామగుండంలో ఎయిర్ పోర్టు నిర్మాణంలో ముందడుగు పడిందన్నారు. ఎయిర్ పోర్టు నిర్మాణానికి సంబం ధించి ఆర్ ఎండ్ బీ, ఎయిర్ పోర్టు నిర్మాణంలో భాగమైన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు ఏర్పాటు ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.
రామగుండం ఎయిర్ పోర్టు విషయంతో రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ (R&B) కీలక ఆదేశాలు జారీ చేసిందన్నారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండంలో 591 ఎకరాల భూమిపై గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు ఏర్పాటుకు ప్రతిపాదనపై స్పందించిన రాష్ట్రప్రభుత్వం.. ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(AAI) కు రూ. 40.53లక్షల పిసిబిలిటీ స్టడీ ఫీజు చెల్లించిందన్నారు. గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రాయం అభివృద్ధి కోసం ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు రూ. 50 లక్షలు డిపాజిట్ చేయాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు.