పీవీ స్పూర్తితో దేశాభివృద్ధి కోసం పనిచేస్తాం: ఎంపీ వంశీకృష్ణ

పీవీ స్పూర్తితో దేశాభివృద్ధి కోసం పనిచేస్తాం: ఎంపీ వంశీకృష్ణ

పీవీ స్పూర్తితో దేశాభివృద్ధి కోసం పనిచేస్తామన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. పీవీ జయంతి  సందర్భంగా నివాళి అర్పించారు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మల్లురవి, గడ్డం వంశీకృష్ణ, జైవీర్ రెడ్డి, చామల కిరణ్ రెడ్డి. ఈ సందర్బంగా మాట్లాడిన ఎంపీ వంశీకృష్ణ.. దేశ అభ్యున్నతికి పీవీ సంస్కరణలు ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పారు. పీవీ నరసింహారావు కేబినెట్ లో కాకా కేంద్రమంత్రిగా దేశాభివృద్ధిలో భాగం అయ్యారని తెలిపారు. ఆ రోజుల్లో ప్రతిపక్షాలు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చేవారని..ఇపుడు స్పీకర్ ఓం బిర్లా నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేలా స్పీకర్ చర్యలున్నాయన్నారు.

నీట్ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు పార్లమెంట్ లో కొట్లాడుతామన్నారు  ఎంపీ  వంశీకృష్ణ. నీట్ పేపర్ లికేజ్ పై చర్చ చేపట్టాలంటూ విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్ చేస్తూ లోక్ సభ వెల్ లో ఆందోళనలు  చేశామన్నారు.
మల్లురవి

దేశం అత్యంత క్లిష్ట సమయంలో ఉన్న దశలో దేశానికి ఒక దిశను చూపించిన వ్యక్తి పీవీ నరసింహారావు అని ఎంపీ మల్లు రవి అన్నారు.  ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్ తో కలిసి వ్యవస్థను గాడిలో పెట్టి, సంస్కరణలను అమలు చేసి భారత్ ను ప్రపంచ దేశాల సరసన నిలిపారన్నారు. ఆయనతో పనిచేసే అవకాశం  దక్కడం తన  అదృష్టమన్నారు.