కార్తీకమాసం నవంబర్ 20న అమావాస్యతో ముగుస్తుంది. ఇప్పటికే ( నవంబర్8 నాటికి) రెండు సోమవారాలు.. ఏకాదశి.. పౌర్ణమి ముగిశాయి. ఇక నవంబర్ 10న మూడవ సోమవారం. కార్తీక మాసం నెల రోజులు చాలా పవిత్రమైన రోజులైనా.. హిందువులు సోమవారాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఇక మూడవ సోమవారం రోజు విష్ణుమూర్తి వైకుంఠం నుంచి కైలాసానికి వెళ్లాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజున పార్వతి పరమేశ్వరులు.. విష్ణుమూర్తి దంపతులను సాదరంగా ఆహ్వానించారట. ఆ రోజు చేసే వ్రతాలు.. పూజలు.. దానాలతో విష్ణుమూర్తి సంతృప్తి చెందుతాడని పురాణాలు చెబుతున్నాయి.
కార్తీకమాసం మూడో సోమవారం ( నవంబర్ 10) న చేసే పూజల వలన శివకేశవుల అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఆరోజున చేసే పూజల వలన కోటి పుణ్య ఫలాలు దక్కుతాయని పురాణాల ద్వారా తెలుస్తుందని. కార్తీకమాసం మూడవ సోమవారం కైలాసంలో ఆకాశ దీపం సంబరాలు జరిగాయని స్కాంద పురాణంలో పేర్కొన్నారు.
ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం కార్తీకమాసం మూడో సోమవారం ఆకాశదీపాన్ని దర్శించుకొంటే కోటి పుణ్యాలతో పాటు.. వెయ్యి అశ్వమేధ యఙ్ఞాలు చేసిన ఫలితాలు లభిస్తాయని పురాణ కథనం.. కైలాసంలో కార్తీకపురాణం మహత్యం గురించి వివరించారు.
ఇక ఎప్పటి మాదిరిగానే తెల్లవారుజామునే కార్తీక స్నానాలు చేసి దీపారాధన చేయాలి, దీపాలను ఆవునెయ్యితో వెలిగించాలి. నవంబర్ 10 కార్తీకమాసం మూడవ సోమవారం రుద్రాభిషేకం చేయాలి. తరువాత విష్ణు సహస్రనామం పఠించాలి. లేదంటే భక్తి శ్రద్దలతో రుద్రాభిషేకం .. చూసినా... విష్ణు సహస్రనామం విన్నా.. అంత ఫలితం వస్తుంది. కొన్ని దేవాలయాల్లో వీలుని బట్టి లక్ష పత్రి పూజ చేస్తారు. ఈ పూజకు లక్ష పత్రి ( ఆకుల దళాలను) ఉపయోగిస్తారు. తులసి దళాలను.. బిల్వపత్రాలతో అర్చిస్తారు. తదనంతరం ధూప.. దీప .. నైవేద్యాల తరువాత.. తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారు. కార్తీక పురాణాన్ని చదవాలి.
ఇక ఉపవాస దీక్షను పాటించే వారు పాలు.. పండ్లు తీసుకోవచ్చు. దేవాలయంలో ప్రసాదం తినవచ్చు. అంతేకాని ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో ఉపవాసం ఉండకూడదు. పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు.. వృద్దులు.. సాయంత్రం నక్షత్ర దర్శనం... దీపారాధన .. పూజ.. దేవాలయ దర్శనం తరువాత.. భోజనం చేయవచ్చు. జీవితంలో తెలిసో .. తెలియకో చేసే కొన్ని పనులు పాపాలుగా వెంటాడుతూ ఉంటాయి. అటువంటి పాపాల వల్ల జీవితాంతం అష్టకష్టాలు పడే వారు కూడా ఉంటారు. ఇలా చేస్తే అలాంటి పాపాలు హరిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
నవంబర్ 10న చేసే దీపారాధన, ఆకాశదీప దర్శనం, దానం, ధర్మం రెట్టింపు ఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు.ఈ నెల రోజులు పూజ చేసిన ముఖ్యంగా మూడో సోమవారం ఉపవాసం ఉండి అత్యంత భక్తి శ్రద్ధలతో శివయ్యను పూజిస్తారు.కొంతమంది సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత శివయ్య పూజ చేసి ఆ తర్వాత ఉపవాస దీక్ష విరమిస్తారు.అందుకే నవంబర్ 10) కార్తీకమాసం మూడో సోమవారం కాబట్టి ఉపవాస దీక్ష చేపట్టి ఆ పరమేశ్వరుడు అనుగ్రహం సొంతం చేసుకుంటారు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేసి ఉపవాసం ఉండాలి. సాయంత్రం ప్రదోషకాల సమయంలో ఇంటిలోని పూజ గదిలో దీపారాధన చేసి నక్షత్ర దర్శనం తర్వాత శివాలయనికి వెళ్లి పరమేశ్వరున్ని దర్శించుకుని దేవాలయంలో దీపారాధన చేయాలి. ఓం నమఃశివాయ పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి.ఆ తర్వాత భోజనం చేసి ఉపవాస దీక్షను విరమించాలి.ఇలా చేయడం వల్ల కోటి సోమవారాలు చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది.
