- తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడప నగేశ్
గుడిహత్నూర్, వెలుగు : ఉట్నూర్ మండల కేంద్రంలో ఈనెల 23న జరిగే ఆదివాసీల హక్కుల కోసం జరిగే ధర్మ యుద్ధ సభను విజయవంతం చేయాలని తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడప నగేశ్ పిలుపునిచ్చారు. శుక్రవారం గుడిహత్నూర్ మండల కేంద్రంలోని కుమ్రంభీమ్ విగ్రహం వద్ద సభకు సంబంధించిన వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. +
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ట బద్ధతలేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలిగించాలనే ప్రధాన డిమాండ్ తో ఆదివాసులు పోరాడుతున్నారని తెలిపారు. ఉట్నూర్ లో జరిగే సభకు రాష్ట్ర నలుమూలల నుంచి ఆదివాసీలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ సేన జిల్లా అధ్యక్షుడు రాయిసిడం జంగు, తుడుం దెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు తొడసం శంకర్, బోథ్ కన్వీనర్ మెస్రం నాగనాథ్, జిల్లా నాయకులు మెస్రం మోహన్, కొట్నాక్ గణేశ్, ఛత్రుగన్, శంభు తదితరులు పాల్గొన్నారు.
