వైభవంగా పెద్దాపూర్ మల్లన్న జాతర

వైభవంగా పెద్దాపూర్ మల్లన్న జాతర

జగిత్యాల: జిల్లాలోని మెట్పల్లి మండలం పెద్దాపూర్లో మల్లన్న జాతర వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యంలో తరలివచ్చారు. భక్తులు మల్లన్న స్వామికి  ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీగా తరలివచ్చిన మహిళలు బోనాలతో మల్లన్న దేవుడికి నైవేద్యం సమర్పించారు. దాదాపు 50 వేల మందికి పైగా మహిళలు స్వామి వారికి బోనాలు సమర్పించినట్లు అధికారులు తెలిపారు. ఆలయ ప్రాంగణమంతా వేలాది మంది భక్తులతో కిటకిటలాడింది. శివ సత్తుల పూనకాలు, పోతురాజుల ఆటలు ఆకట్టుకున్నాయి. జాతరలో  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తల కోసం...

కొత్త టీమ్ తో కాంగ్రెస్ కు బలం పెరిగింది

విగ్రహ ఏర్పాటులో వివాదం.. బోధన్ లో హై టెన్షన్