‘చికిరి చికిరి’ అంటూ ఇప్పటికే ఓ ట్రెండ్ సృష్టించిన ‘పెద్ది’ చిత్రంలోని సాంగ్ ట్రెమండెస్ రెస్పాన్స్‌తో యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. తాజాగా సెకండ్ సాంగ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్.
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న ఈ చిత్రం నుంచి ‘రై రై రా రా’ అంటూ సాగే రెండో పాటను మార్చి 2న విడుదల చేయనున్నట్టు గురువారం ప్రకటించారు. నీ అయ్య వడ్డీ...నీ బిడ్డ కడితే..నువ్వేమి పొడిచావనే!!
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రామ్ చరణ్ మ్యాసీవ్ గెటప్‌లో కనిపిస్తున్నాడు. ఒత్తైన జుట్టు, నోట్లో బీడీ, భుజంపై ఒక ఆయుధం లాంటిది పట్టుకుని రగ్గడ్ లుక్‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు చరణ్. బ్యాక్‌డ్రాప్‌లో ప్రజలంతా పరుగెడుతూ గందరగోళ పరిస్థితి కనిపించడంతో ఆసక్తి నెలకొంది.
ఫస్ట్ సాంగ్ తరహాలోనే ఈ పాట కోసం కూడా ఏఆర్ రెహమాన్ తనదైన సంగీతంతో అలరిస్తారని మేకర్స్ చెప్పారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది.
నీ అయ్య వడ్డీ...
— PEDDI (@PeddiMovieOffl) February 26, 2026
నీ బిడ్డ కడితే…
నువ్వేమి పొడిచావనే!!
రై రై రారా రై రై రారా… 🔥🔥🔥
Nee Ayya Vaddee…
Nee Bidda Kadithe…
Nuvvemi Podichaavanee…
RAI RAI RAA RAA🔥🔥🔥#RaiRaiRaaRaa #Peddi pic.twitter.com/RVfjJg93ro
