సర్పంచ్ తన ఇంట్లోనే పెద్దపాడు గ్రామ పంచాయతీ ఆఫీసు

 సర్పంచ్  తన ఇంట్లోనే పెద్దపాడు గ్రామ పంచాయతీ ఆఫీసు

గద్వాల, వెలుగు: ధరూర్  మండలం పెద్దపాడు గ్రామ పంచాయతీ ఆఫీసును బీఆర్ఎస్  పార్టీకి చెందిన సర్పంచ్  తన ఇంట్లోనే పెట్టుకోవడం గ్రామస్తులు, కొందరు వార్డు మెంబర్లకు ఇబ్బందికరంగా మారింది. గ్రామంలో కొత్తగా గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయడంతో సొంత బిల్డింగ్  లేదు. గ్రామస్తులకు అనుకూలమైన బిల్డింగ్ లో పంచాయతీ ఆఫీస్ ను పెట్టాల్సి ఉన్నప్పటికీ, ఆఫీసర్లు, సర్పంచ్  ఏకమై గ్రామస్తులు అంగీకరించకపోయినా కొన్ని నెలల నుంచి జీపీ ఆఫీసును సర్పంచ్  ఇంట్లోనే నిర్వహిస్తున్నారు. దీంతో కొందరు వార్డు మెంబర్లు మీటింగ్ లకు అటెండ్ కావడం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న సర్పంచ్  పంచాయతీ నిధులను పక్కదారి పట్టిస్తున్నాడని వార్డ్ మెంబర్లు ఆరోపిస్తున్నారు. ఇతర పార్టీలకు చెందిన వారు అక్కడికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి దగ్గరే పంచాయతీ ఆఫీస్  పెట్టుకొని కిరాయి తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇదిలాఉంటే గ్రామంలో అనువైన బిల్డింగ్​ లేకపోవడంతోనే సర్పంచ్​ ఇంట్లో జీపీని కొనసాగిస్తున్నామని డీఎల్పీవో వెంకట్ రెడ్డి తెలిపారు.