దొంగలు బాబోయ్.. దొంగలు..పర్వతాపూర్, ఇండింపెండెంట్ కాలనీల్లో వరుస ఘటనలు

దొంగలు బాబోయ్.. దొంగలు..పర్వతాపూర్, ఇండింపెండెంట్ కాలనీల్లో వరుస ఘటనలు
  • పోలీసులు పట్టించుకోవడం లేదని రాచకొండ కమిషనర్‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు
  • మేడిపల్లి సీఐని సీపీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు 

మేడిపల్లి, వెలుగు :  పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్  పర్వతాపూర్, ఇండిపెండెంట్ కాలనీలో వరుస దొంగతనాలతో కాలనీ వాసులు బెంబేలెత్తుతున్నారు.  కేవలం ఆరు నెలల వ్యవధిలో ఐదు చోరీలు జరగడంతో  దొంగలతో తమకు ప్రాణహాని ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.  పోలీసులు సరైన విధంగా పెట్రోలింగ్ చేయడం లేదని .. దీంతో చోరీలు ఆగడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

 పలుమార్లు దొంగలు కాలనీలో తిరిగినట్టు  సీసీ కెమెరాలురికార్టైన ఫుటేజ్ లను  పోలీసులకు చూపించినా..   స్పందించి చర్యలు తీసుకోలేదని వాపోయారు. అంతేకాకుండా పోలీస్ గస్తీ పెంచాలని మంత్రి మల్లారెడ్డికి పలుమార్లు ఫిర్యాదు చేశారు. కాలనీల్లో వరుసగా దొంగతనాలు జరుగుతున్నా కూడా సీఐ కేసులు నమోదు చేయడం లేదని స్థానికులు రాచకొండ పోలీస్ కమిషనర్‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేశారు.  దీంతో కమిషనర్‌‌‌‌‌‌‌‌ మేడిపల్లి సీఐ గోవర్దన గిరిని సీపీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.