రాజీనామా చేయకుంటే ట్రంప్‌‌పై అభిశంసనే

రాజీనామా చేయకుంటే ట్రంప్‌‌పై  అభిశంసనే

వాషింగ్టన్ డీసీ: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్‌ ట్రంప్‌‌‌ను పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్లు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. పెన్స్‌ 25వ సవరణ ద్వారా ట్రంప్‌‌‌ను తొలగించాలని లేకపోతే సభలో అభిశంసన ప్రక్రియ మొదలపెడతామని స్పీకర్ నాన్సీ పెలోసీ, షుమెర్‌ వేర్వేరు ప్రకటనల ద్వారా హెచ్చరించారు. వాటర్‌‌గేట్ స్కాండల్ సమయంలో అప్పటి అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ రాజీనామా చేయాలని రిపబ్లికన్లు ఒత్తిడి తీసుకొచ్చిన అంశాన్ని పెలోసీ గుర్తు చేశారు. ట్రంప్ మొండివైఖరి దేశ ప్రజాస్వామ్యానికి చేటు చేస్తోందని మండిపడ్డారు. ట్రంప్‌ పాలక వర్గంలోని ఉన్నతాధికారులు ఒక్కొక్కరిగా రాజీనామాలు చేస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ 25వ సవరణ ప్రకారం.. ట్రంప్‌ను తప్పించాలని డెమోక్రటిక్‌ పార్టీ సభ్యులతోపాటు కొంతమంది రిపబ్లికన్‌ సభ్యులు కూడా డిమాండ్‌ చేస్తున్నారు.