Multi bagger Stock :పెన్నీ స్టాక్.. రూ.లక్ష పెట్టుబడికి రూ. 3.81 కోట్లు

Multi bagger Stock :పెన్నీ స్టాక్.. రూ.లక్ష పెట్టుబడికి రూ. 3.81 కోట్లు

భారతీయ స్టాక్ మార్కెట్: హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ షేర్లు ఇటీవలి కొన్ని సంవత్సరాల్లో స్టాక్ మార్కెట్ డెలివరీ చేసిన మల్టీ బ్యాగర్ స్టాక్ లలో ఒకటి. ఈ రియల్ ఎస్టేట్ స్టాక్.. 2019 మార్చి నుంచి 2024 ఫిబ్రవరి 16 వరకు ఒక్కో షేరుకు 1 రూపాయినుంచి దాదాపు రూ. 380 కి పెరిగింది. దాని పెట్టుబడిదారులకు దాదాపు 381 రెట్ల రాబడిని అందించింది. పెట్టుబడిదారులు ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తే అతి తక్కువ సమయంలో పెట్టుబడి దారుడి రూ. 1 లక్ష ను రూ. 3.81 కోట్లకు పెంచింది. అంటే ఈ పెన్నీ స్టాక్ గత ఐదేళ్లలో 380 రెట్లు పెరిగింది. 

హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ షేర్ ధర హిస్టరీ

గతవారంలో ఈ మల్టీ బ్యాగర్ రియల్టీ స్టాక్ గత రెండు వరస సెషన్లలో అంటే గురువారం , శుక్రవారం ఎగువ సర్క్యూట్ ను తాకింది. ఈ రియల్టీ స్టాక్ గత నెలలో దాని వాటాదారులకు దాదాపు 2 శాతం రాబడిని అందించింది. గత ఆరు నెలల్లో హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ షేరు ధర దాదాపు రూ. 130 నుంచి రూ. 381 వరకు పెరిగింది. ఈ సమయంలో దాని వాటాదారులకు 190 శాతం రాబడిని అందించింది. 

2023లో ఈ మల్టీ బ్యాగర్ రియల్టీ స్టాక్ ఒక్కో షేరు స్థాయికి దాదాపు రూ. 99.60 నుంచి రూ. 381 వరకు పెరిగింది. ఈ సమయంలో దాదాపు 280 శాతం ర్యాలీని సాధిం చింది. మొత్తంగా గత ఐదేళ్లలో ఈ రియల్ ఎస్టేట్ స్టాక్ దాదాపు రూ. 1 నుంచి రూ. 381కి చేరుకోవడంతో మల్టీ బ్యాగర్ పెన్నీ స్టాక్ గా మారింది.