60 ఏళ్లు నిండితే రూ.3 వేలు పింఛన్

60 ఏళ్లు నిండితే రూ.3 వేలు పింఛన్

 దేశంలో 60 ఏళ్లు నిండిన అందరికీ రూ.3 వేలు పెన్షన్ అందిస్తామని ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌. ప్రధాన మంత్రి శ్రమయోగి బంధన్ పేరుతో దేశంలో అసంఘటిత రంగ కార్మికులకు పింఛన్ అందిస్తామన్నారు. 60 ఏళ్లు నిండిన అందరికీ నెలనెలా పింఛన్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నెలకు రూ.100 ప్రీమియం చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత పింఛన్ అందుతుందన్నారు. దీంతో దేశంలో 10 కోట్ల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందని పియూష్ గోయెల్ వివరించారు.

మార్చి వరకు దేశంలోని అన్ని ఇండ్లకు విద్యుత్ కనెక్షన్ అందుతుందని చెప్పారు పియూష్ గోయల్. సినిమా పరిశ్రమలో అనుమతి కోసం సింగిల్ విండో విధానం తెస్తామన్నారు. ఇల్లు ఎవరైనా కొంటే వారికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలా వద్దా అనేది త్వరలో నిర్ణయిస్తామన్నారు.

రక్షణ రంగానికి బడ్జెట్ లో అత్యంత ప్రాధాన్యం
రక్షణ రంగానికి ఈ ఏడాది 3 లక్షల కోట్ల రూపాయిలను కేటాయించామన్నారు. అవసరమైతే అదనపు నిధులను కేటాయిస్తామన్నారు మంత్రి పీయూష్. 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వన్‌ మ్యాన్‌ వన్‌ పెన్షన్‌ అమలు చేశామని తెలిపారు.