మాజీ ఎమ్మెల్యేల పెన్షన్, రిటైర్మెంట్ ఏజ్ పెంపునకు ఆమోదం

మాజీ ఎమ్మెల్యేల పెన్షన్, రిటైర్మెంట్ ఏజ్ పెంపునకు ఆమోదం
  • మాజీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల పెన్షన్ రూ.30 వేల పెన్షన్ రూ.50వేలకు, రూ.50 వేల పెన్షన్ రూ.70 వేలకు పెంపు
  • ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 నుండి 61 ఏండ్లకు పెంపు
  • అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టిన మంత్రి హరీష్ రావు
  • త్వరలోనే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం -మంత్రి హరీష్ రావు

హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల పెన్షన్ పెంపు బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రూ.30 వేలు ఉన్న పెన్షన్ రూ.50వేలకు, అలాగే ప్రస్తుతం రూ.50 వేలు ఉన్న పెన్షన్ రూ.70 వేలకు పెంచుతూ మంత్రి హరీష్ రావు  అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుకు సభ ఆమోదం ప్రకటించింది. అలాగే ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58న ఏండ్ల నుంచి 61 ఏండ్లకు పెంచిన బిల్లుకు కూడా శాసనసభ ఆమోద ముద్ర వేసింది. బిల్లులను ప్రవేశపెట్టిన సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పదవీ విరమణ వయసును పెంచడం జరుగుతోందన్నారు. త్వరలోనే 50,000  ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆస్పత్రులకు వెళ్ళినప్పుడు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారని ప్రస్తావిస్తూ.. ఎమ్మెల్యే భార్య లేదా భర్తకు ఆరోగ్యపరంగా 10లక్షలు పెంచుతూ బిల్లు సవరణ చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 1లక్ష రూపాయల వరకు ఇచ్చేవాళ్లం..ఎమ్మెల్యేలకు ఆరోగ్య సమస్యల్లో అధికంగా బిల్లు అయితే కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది..సభ్యులందరికీ పెన్షన్స్ పెంచాలని సీఎం ను మాజీ ఎమ్మెల్యేలు కలిశారు.. జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే భాగన్న ఈ మధ్యే మరణించారు.. హాస్పిటల్ లో 2లక్షల బిల్లు పెండింగ్ లో ఉండే.. అదికూడా కట్టలేని పరిస్థితి వచ్చింది.. అందుకే మాజీ ఎమ్మెల్యేలకు 30వేల నుంచి 50వేలకు పెన్షన్స్ పెంచుతున్నామని.. అప్పర్ సీలింగ్ కూడా 70వేలకు పెంచుతూ సవరణ చేస్తున్నామన్నారు. త్వరలోనే ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తుందని మంత్రి హరీష్ రావు వివరించారు.