ప్రజలు TRSకి ఓట్లు వేయడానికి రెడీగా ఉన్నారు

ప్రజలు TRSకి ఓట్లు వేయడానికి రెడీగా ఉన్నారు

భూపాలపల్లి జిల్లా : సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు ప్రశ్నలు వేయకుండా సంతృప్తిగా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా శనివారం ఆమె భూపాలపల్లి జిల్లాలో మాట్లాడారు. “ ఏమి మాట్లాడినా తెలంగాణ రాకముందు..తెలంగాణ వచ్చిన తరువాత అని మాట్లాడితే అనేక సందేహాలకు సమాదానాలు దొరుకుతాయి. ఈ నియోజకవర్గ అభివృద్ధికి తొలి స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అద్భుతంగా కృషి చేస్తున్నారు. వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా తీసుకెళ్తున్నారు. ఒక అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టు. రైతులకు రెండుపంటలకు నీరు, 24 గంటలు ఉచిత కరెంట్. రైతులు సంతోషంగా ఉన్నారు. పల్లెలో అందరూ సంతోషంగా ఉండాలని పల్లె ప్రగతి అమలు చేస్తున్నారు. త్వరలో పట్టణ ప్రగతి కూడా అమాలు చేస్తారు. ఉద్యమ స్పూర్తితో ఎన్నికల్లో 63 సీట్లు వస్తే.. నాలుగున్నర ఏళ్ళ పాలన తర్వాత 89 సీట్లు వచ్చాయంటే కేసీఆర్ పరిపాలన దక్షతకు నిదర్శనమ్.

సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి అవుతుందని నమ్మిన గండ్రతో కలిపి 12 మంది ఇతర పార్టీ నాయకులు కూడా TRSలో చేరారు. బీజేపీ 2,3 సీట్లు గెలిస్తే ఆ మిడిసిపాటుతో ప్రజలకు పనికిరాని పనులు చేస్తూ నమ్మకం కోల్పోయారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో పూర్తిగా క్లీన్ స్వీప్ చేసి కేసీఆర్ నాయకత్వం మీద ఉన్న నమ్మకానికి నిదర్శనం. పార్టీలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ళు నాకు కూడా పదవులు రాలేదు. కానీ సీఎం గారి నమ్మకంతో పార్టీ కోసం పనిచేస్తే నాకు తొలి మహిళా ఎమ్మెల్సీ ఇచ్చి, తొలి మహిళా మంత్రిని చేశారంటే నమ్మినందుకు ఇచ్చిన బహుమానం.

వేరే పార్టీల్లో మంత్రులు కావాలంటే ఎంత లాబీయింగ్ చేయాలో తెలుసు. కానీ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాకు ఎమ్మెల్సీ ఇచ్చుడే ఎక్కువ అనుకుంటే.. గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ ఇచ్చారంటే అది సీఎం కేసీఆర్ వల్లే అవుతుంది. పార్టీని నమ్మిన సామాన్య కుటుంబం నుంచి వచ్చిన దయాకర్ ని రెండు సార్లు వరంగల్ నుంచి ఎంపీ చేయడం TRSకే సాధ్యం. ఈ నియోజకవర్గంను తొలి స్పీకర్ ఆదర్శంగా తీర్చిదిద్దారు. నా నియోజకవర్గంలో నేను, రెడ్యా నాయక్ వైరి వర్గంగా ఉండే. కానీ ఇప్పుడు ఒక్కటయ్యం. మా దగ్గర అన్నిటికి అన్ని గెలుస్తాం. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క మున్సిపాలిటీ ఓడిపోకుండా అంతటా గులాబీ పార్టీ జెండా ఎగురవేయబోతోంది. భూపాలపల్లి జిల్లా ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తున్నా TRSకి అవకాశం ఇవ్వండి. అభివృద్ధికి పట్టం కట్టండి.  ఇక్కడ మనం చేస్తున్న అభివృద్ధిని ఇతర రాష్ట్రాలు, పార్టీలు కాపీ కొడుతున్నాయి” అని తెలిపారు మంత్రి సత్యవతి రాథోడ్.