కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తరు?

కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తరు?

ఆఫీస్​ ల చుట్టూ ప్రదక్షిణలు  చేస్తున్న  దరఖాస్తు దారులు
ఉమ్మడి జిల్లాలో  21 వేల అప్లికేషన్లు పెండింగ్​ 

    

నిజామాబాద్,  వెలుగు: ఉమ్మడి జిల్లాలో  వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల  పింఛన్లకు దరఖాస్తులు చేసుకొని రెండేండ్లు గడుస్తున్నా..  మంజూరుపై స్పష్టత రావడంతో లేదు. దీంతో దరఖాస్తుదారులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.   ఉమ్మడి  జిల్లాలో ఇప్పటి వరకూ  21 వేలమంది కొత్తగా పింఛన్లకు   అప్లయ్​ చేసుకున్నారు. వాటి కోసం  మండల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పింఛన్​ మంజూరు సమాచారం తెలుసుకొనేందుకు ఆఫీస్​లకు వస్తున్న  వారిని  కిందిస్థాయి సిబ్బంది వెనక్కి పంపిస్తున్నారు. దీంతో పింఛన్​ ఇస్తరో? లేదో? అని  దిగులు పడుతున్నారు. 

ప్రకటనకే పరిమితం.. 

ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకూ 3,21,942  మంది  పింఛన్లు  పొందుతున్నారు.  నిజామాబాద్​లో 2,39,394 మంది ఉండగా..   కామారెడ్డి లో 82,548 మంది లబ్ధి దారులు ఉన్నారు. కొత్త పింఛన్ల దరఖాస్తులు తీసుకుంటున్నా.. మంజూరు చేయడంలో మాత్రం  ముందుకు సాగడం లేదు.  ఆసరా పింఛను పొందేందుకు  65 ఏండ్ల నుంచి  57 ఏండ్లు కుదించి నెలనెలా పింఛన్​ అందజేస్తామని   సీఎం కేసీఆర్​ ప్రకటించారు.  కానీ ఏడాది దాటిపోతున్నా నేటికి ఆ హామీ అమల్లోకి రావడం లేదు.  వయస్సు కుదించినట్టు చెప్పగా.. వచ్చిన దరఖాస్తులను వెరిఫై చేస్తున్నామని,  ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే తప్ప తామేమీ చేయలేమని అధికారులు  
చెప్తున్నారు.   

రెండేండ్లుగా చూస్తున్నా

నా భర్త చనిపోయి రెండేండ్లు అవుతోంది.  ఇప్పటిదాకా మూడు సార్లు  వితంతు  పింఛన్​ కోసం  దరఖాస్తు చేసుకున్న.    ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా .  వచ్చినప్పుడు ఇస్తాం అంటూ తిప్పి పంపుతున్నారు
- మేకల గంగామణి

నష్టపోతున్నాం 

అర్హులైన లబ్ధిదారులు  పింఛన్‌‌ను నష్ట పోతున్నాం.  రెండేండ్ల  కిందట నా చేయి విరగడంతో బీడీలు మానేసాను. వికలాంగుల పింఛన్​ రావడంలేదు.  నెలనెలా పింఛన్‌‌ను అందిస్తే తమకు ఆర్థికంగా  వెసులుబాటు కలుగుతుంది,  కానీ ప్రభుత్వం  మా త్రం  నుంచి కొత్త పింఛ న్‌‌ల ఊసెత్తడంలేదు.  ప్రభుత్వం వెంటనే కొత్త పింఛ న్ల మంజూరు చేయాలే.  
- ఆశవ్వ సీతాయిపేట ధర్​ పల్లి  

ఆఫీస్​లకు పోతే తిప్పి పంపిస్తున్రు  

ఆఫీస్ లకు పోతే  రావొద్దని తమను తిరిగి పంపిస్తున్రు. వృద్ధాప్య  పింఛన్​ కోసం ప్రజావాణిలో దరఖాస్తు చేసి ఏడాది అవుతుంది.   గత సంవత్సరం  నుంచి ఆఫీస్​ ల చుట్టూ తిరుగుతున్నా. పెద్ద సార్ల ను అడిగినా ఫలితం లేదు. మూడేండ్ల కింద పింఛన్లు మంజూరు చేస్తామని సర్కార్​ చెప్పింది. కానీ ఇప్పటివరకు ఫించన్​ రాలే డబ్బులు రాలే.
- గంగాధర్  జన్నేపల్లి