లక్సెట్టిపేట,వెలుగు: ప్రధాని నరేంద్రమోడీ చేస్తున్న అభివృద్ధిని చూసి జనం బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి తెలిపారు. ఆదివారం లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాలలో ఎనగందుల లక్ష్మణ్ ఆధ్వర్యంలో సుమారు150 మంది బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రఘునాథ్వెరబెల్లి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు. అనంతరం లక్సెట్టిపేటలో ఏర్పాటు చేసిన పార్టీ మండల కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరయ్యారు. లక్సెట్టిపేట ప్రభుత్వ జూనియర్‌కాలేజీ భవనం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు హరిగోపాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి రజనీశ్ జైన్, నియోజకవర్గ కన్వీనర్ మల్లికార్జున్, మండల అధ్యక్షుడు బొప్పు కిషన్, లీడర్లు బొప్పు సతీశ్, రాజలింగు, స్వామి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రామన్న మతిభ్రమించి మాట్లాడుతుండు
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మతిభ్రమించి మాట్లాడుతున్నారని, యువకులంతా బీఆర్ఎస్ లో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారనడం హాస్యాస్పదమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్శంకర్విమర్శించారు. ఆదివారం పట్టణంలోని భాగ్యనగర్, హమాలీవాడ కాలనీలకు చెందిన 100 మంది యువకులు బీజేపీలో చేరిన సందర్భంగా పాయల్శంకర్మాట్లాడారు. బీఆర్ఎస్ లీడర్లు ఎన్నికలకు ముందు అరచేతిలో స్వర్గం చూపించి యువతను మద్యానికి బానిస చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కార్యక్రమంలో పార్టీ లీడర్లు లాలా మున్నా, దినేశ్మాటోలియా, నగేశ్, రాకేశ్, ముకుంద్ రావు, సచిన్, సుభాష్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు అండగా నిలిచేది కమ్యూనిస్టులే
మంద్రమర్రి, వెలుగు: ప్రజా సమస్యలపై పోరాటం చేసి వారికి అండగా నిలిచేది కమ్యూనిస్టులేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేణి శంకర్ చెప్పారు. ఆదివారం రాత్రి మందమర్రి మార్కెట్లోని అబ్రహం విగ్రహం ఆవరణలో నిర్వహించిన చెన్నూర్ నియోజకవర్గ స్థాయి మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, దోపిడీదారుల నియంత్రణ కమ్యూనిస్టులకే సాధ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్ లను వేలం ద్వారా ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడంతో సింగరేణి మనుగడ కష్టమన్నారు. అర్హులైన పేదలకు డబుల్బెడ్రూమ్ ఇండ్లు, దళిత బంధు, మూడు ఎకరాల స్థలం ఇవ్వాలన్నారు. పోడు భూముల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి, వీటీ అబ్రహం స్తూపానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎండీ అక్బర్ లలీ, జిల్లా కా
ర్యవర్గ సభ్యులు భీమనాథుని సుదర్శనం, ఇప్పకాయల లింగయ్య, మేకల దాసు, రేగుంట చంద్రశేఖర్, వనం సత్యనారాయణ, మందమర్రి, రామకృష్ణపూర్,చెన్నూర్ టౌన్ సెక్రటరీలు కమేర దుర్గరాజు, మిట్టపెల్లి శ్రీనివాస్, సమ్మయ్య, వజ్ర, పద్మ తదితరులు పాల్గన్నారు.
బీఆర్ఎస్ పేరుతో సీఎం కేసీఆర్ ఇక దేశాన్ని దోస్తడు
బెల్లంపల్లి,వెలుగు: టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి దేశాన్ని దోచుకునేందుకు కేసీఆర్ బయలు దేరాడని టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్ ప్రెసిడెంట్ బి.సంజయ్ కుమార్ ఆరోపించారు. ఆదివారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదుపై నిర్వహించిన అసెంబ్లీ నియోజక ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణను కేసీఆర్ దోచుకున్నారని విమర్శించారు.నాడు మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ఎనిమిదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. నియోజకవర్గానికి ఆనుకొని ప్రవహిస్తున్న గోదావరి నీళ్లు పట్టణానికి అందడంలేదన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు పట్టణ కన్వీనర్ గా అమానుల్లా ఖాన్ ను నియమిచింనట్లు తెలిపారు. టీడీపీ లీడర్లు ఎండీ షరిఫా, వాసాల సంపత్, తిరుపతి, టి.మణిరాంసింగ్, మచ్చయ్య, ఖాజా మోయినొద్దీన్, కనకయ్య, సంఘం రాజు, వాసాల సాగర్ పాల్గొన్నారు.
స్థానిక సమస్యలపై పోరాటం చేయాలి
బెల్లంపల్లిరూరల్, వెలుగు: కార్యకర్తలు స్థానిక సమస్యలపై పోరాటం చేయాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మన హరీశ్గౌడ్పిలుపునిచ్చారు. ఆదివారం తాండూరులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మండల కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. తాండూరు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. ఎలక్షన్టైమ్లో టీఆర్ఎస్లీడర్లు ఇచ్చిన హామీలు నెరవేరలేదన్నారు. అర్హులైన దళితులకు దళితబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అచలాపూర్, రేచిని గ్రామలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. డబుల్ బెడ్రూమ్ఇండ్లు ఇంకా అందలేదన్నారు. మండలంలో అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలన్నారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు రామగౌని మహీదర్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి చిలుముల శ్రీకృష్ణదేవరాయలు, బెల్లంపల్లి అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్, ఎస్సీమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పాగడి చిరంజీవి, మండల ఉపాధ్యక్షుడు కోమండ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పట్టెం విష్ణు కళ్యాణ్, సీనియర్ లీడర్లు వై తుకారం, బీజేవైఎం జిల్లా కార్యదర్శి ఏముర్ల ప్రదీప్, విగ్నేశ్, మహేశ్, రవీందర్ పాల్గొన్నారు.
సింగరేణి ప్రైవేటీకరణ వద్దని అసెంబ్లీలో తీర్మానించాలి
మందమర్రి,వెలుగు: సింగరేణిలో ప్రైవేటీకరణపై చిత్తశుద్ధి ఉంటే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఆదివారం మందమర్రిలోని యూనియన్ ఆఫీసులో జరిగిన ఏరియా జనరల్ బాడీ సమావేశానికి ఆయన చీఫ్‌గెస్ట్‌గా హాజరయ్యారు. 2015లో కేంద్రం తీసుకొచ్చిన బొగ్గు గనుల ప్రైవేటీకరణ చట్టానికి పార్లమెంట్లో 13 మంది టీఆర్ఎస్ ఎంపీలు సపోర్ట్ చేశారన్నారు. రాష్ట్రంలోని బొగ్గు బ్లాక్ లను సింగరేణికి ఇవ్వాలని కేంద్రాన్ని అడిగే దమ్ము కేసీఆర్‌కు లేదన్నారు. సింగరేణిలో మహిళా ఎంప్లాయీస్ కు భద్రత లేకుండా పోయిందన్నారు. ఇటీవల వారిపై టీబీజీకేస్ లీడర్ల లైంగిక వేధింపులు పెరిగాయన్నారు. ఖాళీ పోస్టుల భర్తీలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ సందర్భంగా పలువురు టీబీజీకేఎస్, బీఎంఎస్నుంచి ఐఎన్టీయూసీలో చేరారు. సమావేశంలో కేంద్ర కమిటీ జనరల్సెక్రటరీ కాంపెల్లి సమ్మయ్య, మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు దేవి భూమయ్య, తేజావత్ రాంబాబు, కేంద్ర కమిటీ చీఫ్ఆర్గనైజింగ్ కార్యదర్శి రామ్ శెట్టి నరేందర్, బత్తుల వేణు, చంద్రశేఖర్, కుక్కల ఓదెలు, అఖిల తదితరులు పాల్గొన్నారు.
