కాంగ్రెస్ హామీలను ప్రజలు నమ్ముతలేరు : హరీశ్​రావు

కాంగ్రెస్ హామీలను ప్రజలు నమ్ముతలేరు : హరీశ్​రావు
  •     దొడ్డు వడ్లకు కూడా రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ 

కాంగ్రెస్​ పార్టీ మోసపూరిత హామీలను ప్రజలు నమ్ముతలేరని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్​రావు అన్నారు. ఎన్నికల ముందు అమలుకు నోచుకోని హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఆ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయిందని ఆయన విమర్శించారు. గురువారం మహబూబాబాద్​జిల్లా తొర్రూరులోని పీఎస్ఆర్​ గ్రౌండ్​లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ఆధ్వర్యంలో జరిగిన గ్రాడ్యుయేట్​ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో హరీశ్​రావు పాల్గొని మాట్లాడారు. 

కాంగ్రెస్ మాటలు విని ఇప్పటికే ప్రజలు మోసపోయారని.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని ఆయన సూచించారు. మొదటి నుంచీ గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్నికల్లో బీఆర్ఎస్సే​గెలిచిందని, ఇప్పుడు కూడా రాకేశ్ రెడ్డిని గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రూ.2 కోట్ల ఉద్యోగాలు, నల్లధనం వెనక్కి తీసుకొస్తామని గొప్పలు చెప్పుకున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచిందని విమర్శించారు. 

పూడూరులో తడిసిన వడ్లు పరిశీలన

దొడ్డు వడ్లకు కూడా రాష్ట్ర​ ప్రభుత్వం రూ.500 బోనస్ ఇవ్వాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దొడ్డు వడ్లే ఎక్కువగా పండిస్తారని.. కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్​ఇస్తామనడం దారుణమని ఆయన అన్నారు. గురువారం చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తో కలిసి కొండగట్టు అంజన్నను హరీశ్​దర్శించుకున్నారు. గత ఎన్నికల్లో తన గెలుపు కోసం కట్టిన ముడుపును విప్పి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొడిమ్యాల మండలం పూడూరు ఫ్యాక్స్ సెంటర్ లో తడిసిన వడ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ..  జులైలో జరిగే అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు నుంచే వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలని పోరాడుతామన్నారు. రైతులు అసెంబ్లీ బయట పోరాడాలని ఆయన సూచించారు. బోనస్ ఇచ్చే వరకు అసెంబ్లీని నడవనిచ్చే ప్రసక్తే లేదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.  

హైదరాబాద్‍ను జాయింట్‍ క్యాపిటల్‍ చేసే కుట్ర

రాష్ట్రంలోని రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్‍ను జాయింట్‍ క్యాపిటల్‍ చేయాలని కుట్ర చేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు ఆరోపించారు. గురువారం వరంగల్‍ హంటర్‍రోడ్‍లోని సీఎస్‍ఆర్‍ గార్డెన్‍లో బీఆర్‍ఎస్‍ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి తరఫున నిర్వహించిన సమావేశంలో హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు మాట్లాడారు. ‘‘హైదరాబాద్‍ను మరో పదేండ్లు జాయింట్‍ కాపిటల్‍ చేయాలని కుట్రలు జరుగుతున్నయ్‍. కేంద్ర పాలిత ప్రాంతంగా కూడా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాగైతే మన హైదరాబాద్‍ మనకు కాకుండాపోయే ప్రమాదం ఉంది”అని పేర్కొన్నారు. పార్లమెంట్‍ ఎన్నికలు ముగియగానే సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి రాష్ట్రంలో కరెంట్‍ బిల్లులు, ప్లాట్ల రిజిస్ట్రేషన్‍ ధరలు, భూముల ధరల పెంచుతారన్నారు.

తడిసిన వడ్లను కొంటామని మోసం

తడిసిన వడ్లను కొంటాం.. చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఎన్నికల టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చెప్పిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఇప్పుడు ధాన్యం మొలకలు వస్తున్నా పట్టించుకోవట్లేదని హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యారు. రాష్ట్రంలో రైతులు ఎక్కువగా పండించే దొడ్డు రకానికి బోనస్‍ ఇవ్వకుండా.. ఒకట్రెండు శాతం ఉండే సన్నాలకు ఇస్తామనడం మోసమే అవుతుందన్నారు. తీన్మార్‍ మల్లన్నది ప్రశ్నించే గొంతు కాదని, అధికార పార్టీలో ఆయన గొంతు మూగబోయిందని హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విమర్శించారు. ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు మాట్లాడుతూ.. తీన్మార్‍ మల్లన్నను గ్రాడ్యుయేట్లు బ్లాక్‍ మెయిలర్‍ అంటున్నారని, ఆయన గెలిస్తే తమ పరిస్థితి ఎంటని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాళ్లే భయపడుతన్నారని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తనతో చెప్పారన్నారు. తీన్మార్‍ మల్లన్న పెద్ద బ్లాక్‍మెయిల్‍ అని ప్రచారం చేయాలని, అప్పుడు బీఆర్‍ఎస్‍ అభ్యర్థికి 80 శాతం ఓట్లు పడ్తాయంటూ క్యాడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సూచించారు.