మాస్క్‌ ధరించకపోతే జైలుకే

మాస్క్‌ ధరించకపోతే జైలుకే

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు చేపడుతున్నా…కొంత మంది మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తున్నాయి. రూల్స్ ఉల్లంఘించిన వారిపై ఫైన్ కూడా విధిస్తున్నాయి. అయినా పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో కరోనా కట్టడి కోసం నిబంధనలను పాటించని వారిపై మరింత కఠినంగా చర్యలు చేపట్టేందుకు రెడీ అయ్యింది. ముఖ్యంగా మాస్క్ ధరించని వారిని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో వేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా మాస్క్ లేకుండా కనబడితే.. వారెంట్‌తో సంబంధం లేకుండా వారిని అరెస్ట్‌ చేస్తామని తెలిపారు సిర్మౌర్‌ సూపరిండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌. నేరం రుజువైతే వారికి ఎనిమిది రోజుల జైలు శిక్షతోపాటు రూ.5 వేల రూపాయల జరిమానా కూడా విధిస్తామని తెలిపారు.

కరోనా వైరస్ నియంత్రణకు రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం రాత్రి 8 నుంచి ఉదయం 6 గంటల వరకు ఎనిమిది జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ విధించింది.