సీఎం కనిపించడం లేదు: సోషల్ మీడియాలో వీడియోలు వైరల్

సీఎం కనిపించడం లేదు: సోషల్ మీడియాలో వీడియోలు వైరల్

తమిళనాడులో భారీ వర్షాలు  విధ్వంస సృష్టిస్తున్నాయి. తమిళనాడు మొత్తం వరదల్లో చిక్కుకుపోయింది.వందలాది కాలనీలు, ఇండ్లు వరద నీట మునిగాయి.కార్లు, ఇండ్లు, పశవులు కొట్టుకుపోయాయి. పంట నష్టం వాటిల్లింది.నిత్యావసరాలు అందక ప్రజలు పస్తులుంటున్నారు. ఓ వైపు తమిళనాడులో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతుంటే సీఎం ఢిల్లీ టూర్ పై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం నీవెక్కడ అంటూ వీడియోలు ఎక్స్ లో షేర్ చేస్తూ తమ ఆందోళనలు తెలుపుతున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

కేంద్ర ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడుతున్నారు.రాష్ట్ర  ప్రజలను వరదల నుంచి కాపాడాల్సిన సీఎం ఎక్కడ అంటూ భారీ వర్షాలు, వరద బాధితుల ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిండి తిప్పలు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలను వదిలి ఢిల్లీకి పారిపోయి ఏం సాధించారో చెప్పాలని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేని పొత్తులపై ఏం చర్చలు జరుపుతున్నారు.. రాష్ట్ర ప్రజల బాగోగులు పట్టించుకోకుండా స్టాలిన్ ప్రధాని కావాలనుకుంటున్నారా అని తీవ్రంగా విమర్శించారు. 

ఓట్లు వేసిన ప్రజలు నీటిలో తేలియాడుతుంటే.. పొత్తు చర్చలకోసం సీఎం స్టాలిన్ ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారని అంటూ వరదల్లో తేలుతున్న శవాలు ఫొటోలు షేర్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమిళనాడు ప్రజలు . జీవనోపాధిని కోల్పోయి ఇక్కడి ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. ఢిల్లీ లో రాచకార్యం ముగిసిన వెంటనే వచ్చి బాధితులకు రూ. 25వేల ఆర్థిక సాయం చేయాలని.. తమ పరిస్ధితిని వివరిస్తూ వీడియోలు షేర్ చేశారు తమిళ ప్రజలు. 

మరోవైపు కేంద్రం పంపిన ఎన్డీఆర్ ఎస్ బృందాలు సహాయ చర్యల్లో చురుకుగా పాల్గొన్నారు.  వరదల్లో చిక్కుకున్న జనాన్ని కాపాడారు. తూత్తుకుడిలోని నానల్ గట్ లో 57 మంది మహిళలు, 39 మంది పురుషులు, 15 మంది చిన్నారులను సురక్షితంగా కాపాడారు.