ధర్మశాల ఎగ్జిబిషన్ కిటకిట

ధర్మశాల ఎగ్జిబిషన్ కిటకిట

హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. మౌత్ కా కువా... పేరుతో 20 అడుగుల బావి గోడలపైన బైక్, కారుతో స్టంట్లు చేశారు. ఈ స్టంట్లు ఎగ్జిబిషన్ కే ఆకర్షణగా మారాయి.రెండేళ్ల తర్వాత ఎగ్జిబిషన్ నిర్వహించడంతో పిల్లలు ఉత్సాహంగా ఉన్నారంటున్నారు స్థానికులు. తక్కువ డబ్బులకే రిస్కుతో కూడిన స్టంట్లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయని వారు చెబుతున్నారు.

కరోనా వల్ల రెండేళ్లుగా ఎలాంటి ఉత్సవాలు, సంబరాలకు నోచుకోని తాము రెండేళ్ల తర్వాత మునుపటి రోజులను గుర్తు చేసే ఎగ్జిబిషన్ ను చూడడం చాలా ఆనందంగా ఉందన్నారు. కరోనా సమయంలో ఎక్కడా ఎగ్జిబిషన్లు నిర్వహించలేదని, దీనివల్ల  ఆదాయం లేక.. జీతాలు లేక.. చాలా ఇబ్బంది పడ్డామన్నారు నిర్వాహకులు.

 

 

ఇవి కూడా చదవండి

కింగ్ కోఠి ప్యాలెస్ స్వాధీనం కోసం దాడులు చేస్తుండ్రు