కేసీఆర్ స్పీచ్ నడుస్తుంటే వెళ్లిపోతూ కనిపించిన జనం.. ఖాళీగా కనిపించిన కుర్చీలు

కేసీఆర్ స్పీచ్ నడుస్తుంటే వెళ్లిపోతూ కనిపించిన జనం.. ఖాళీగా కనిపించిన కుర్చీలు

మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రగ‌తి నివేదన స‌భ‌లో సీఎం కేసీఆర్ స్పీచ్ ను జనం పట్టించుకోలేదు. బహిరంగ సభకు వచ్చిన పబ్లిక్ కేసీఆర్ మాట్లాడుతుండగానే మధ్యలోనే వెళ్లిపోతూ కనిపించారు. ఓ వైపు కేసీఆర్ ప్రసంగం కొనసాగుతుండగానే.. మరోవైపు..  బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు సభకు వచ్చిన మహిళలు వెళ్లిపోతూ కనిపించారు. కేసీఆర్  స్పీచ్ నడుస్తుంటే జనం వెళ్లిపోతుండడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. 

మరోవైపు.. కేసీఆర్ మాట్లాడుతుండగానే సభలో కొందరు  యువకులు విజిల్స్ వేయడం కనిపించింది. ఆ సమయంలో కేసీఆర్ స్పందిస్తూ... సీటీలు కొట్టేటోళ్లు మనోళ్లు కాదు.. అని చెప్పారు. 

ఇంకోవైపు.. సీఎం కేసీఆర్ మాట్లాడుతుండగా.. ఓ యువకుడు నినాదాలు చేశాడు. మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలని, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని నినాదాలు చేశాడు.

ఒకప్పుడు కేసీఆర్ స్పీచ్ వస్తుందంటే చాలామంది టీవీలకు అతుక్కుపోయేవారు. ఆయన ఏం మాట్లాడుతారోనని జనం ఆసక్తిగా వినేవారు.. చూసేవారు. కానీ.. ఇప్పుడు పరిస్థితులు మారాయి. కొంతకాలంగా కేసీఆర్ స్పీచ్ పట్ల జనం పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదనే చర్చ సాగుతోంది.