మూగ జీవాల‌పై క‌ర్క‌శ‌త్వం.. కొట్టి, ఉరి వేసి చంపారు

మూగ జీవాల‌పై క‌ర్క‌శ‌త్వం.. కొట్టి, ఉరి వేసి చంపారు

నీటి తొట్టిలో పడి కొట్టుమిట్టాడుతున్న ఓ కోతిని మాన‌వ‌తా దృక్పథంతో కాపాడాల్సింది పోయి… ఆ కోతిని ఉరి తీసి చంపిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా వేంసూరు మండలం అమ్మ‌పాలెం గ్రామంలో సాదు వేంకటేశ్వరరావు అనే అతని ఇంటి ఆవరణలో నీటి తొట్టె ఉంది. ప్రమాదవశాత్తు ఆ ఖాళీ నీటి తోట్టిలో ఓ కోతి పడింది. అయితే మూగ జీవిని కాపడాల్సింది పోయి వెంకటేశ్వరరావు ఆ కోతిని కర్రతో కొట్టి చంపాడు. చంపి దానిని అక్కడే పడేయ్యటంతో వందలాదిగా కోతులు ఆ ప్రదేశానికి చేరుకున్నాయి. దీంతో చుట్టుపక్కల వారు బతికి ఉన్న కోతిని చంపితే మిగతా కోతులు పారిపోతాయని చెప్పటంతో అక్కడే ఉండే మరో వ్యక్తి జోసెఫ్ రాజ్ సహయంతో మరో కోతిని పట్టుకొని దానిని కూడా ఉరి వేసి కుక్కలతో‌ కరిపించుకుంటూ కర్రలతో కొట్టుతూ అతి దారుణంగా చంపి కుక్కలకు ఆహారంగా వేశారు.

ఈ ఘటన పై కొందరు ఫారెస్ట్ ఉన్నతాధికారి కి ఫోన్ లో సమాచారం ఇచ్చిన పెద్దగా పట్టించుకోలేదని తెలుపుతున్నారు.
అతి క్రూరంగా రెండు కోతులకు చంపిన వ్యక్తుల పై అటవీ జంతువుల చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.అడవి లో ఆహారం లేక రోడ్లపైకి వస్తున్న మూగజీవాల పట్ల ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదని కుదిరితే వాటికి ఆహారం అందించాలి తప్ప ఈ విధంగా కర్కశంగా ప్రవర్తించి కూడదని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.