
- స్కూళ్లకు వెళ్లే స్టూడెంట్లపై వెంటపడి దాడులు
- బెంబేలెత్తుతున్న జనం
గండిపేట్, వెలుగు : కోతుల బెడదతో రాజేంద్రనగర్ సర్కిల్ ఎర్రబోడ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఒంటరిగా ఉన్న చిన్నారులపై దాడులకు దిగుతున్నాయి. గత 15 రోజుల నుంచి కోతులు గుంపులుగా తిరుగుతుండడంతో జనాలు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే 15 మంది స్టూడెంట్లతో పాటు పలువురు వాటిబారిన పడి గాయపడ్డారని స్థానికులు వాపోతున్నారు. స్కూళ్లకు వెళ్లి ఇద్దరు పిల్లలపై దాడి చేశాయన్నారు.
గాయపడిన చిన్నారులు కోతుల భయానికి స్కూల్‌కు కూడా వెళ్లడం లేదన్నారు. స్థానికులు, బాధితులు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెటర్నరీ అధికారులు బోన్లను ఏర్పాటు చేసి కోతులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని కోతుల బెడద నుంచి ప్రజలను కాపాడాలని కోరుతున్నారు.