డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీలో పేరు లేదని ఆందోళన

డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీలో పేరు లేదని ఆందోళన

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్ వద్ద జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారిపై స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీలో తమ పేర్లు లేవని బాలాజీ నగర్ వాసులు మార్చి 19న ఆందోళన చేపట్టారు. స్థానికంగా ఉన్న బాలాజీ నగర్ లోని పేదలకు రెండు పడకల ఇండ్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. 

తమకు డబుల్ బెడ్రూం ఇల్లు రాలేదని ఓ వ్యక్తి పెట్రోల్ ఆత్మహత్యయత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసలు ఘటనా స్థలానికి చేరుకొని.. వారిని పంపించే ప్రయత్నం చేశారు. కానీ తమకు న్యాయం జరగాలని.. ఎమ్మెల్యే, కార్పొరేటర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ జామ్ తో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.