ఎక్కువ ఖర్చు పెడుతున్నది తిండి, మందులకే

ఎక్కువ ఖర్చు పెడుతున్నది తిండి, మందులకే

కరోనా ఎఫెక్ట్ తో జనం పైసలను ఖర్చు పెట్టే పద్దతిలో మస్త్ మార్పు వచ్చింది. ఇపుడు తిండికి మందు గోలీలకే ఎక్కువగా ఖర్చు చేస్తున్నరు. మిగతా వాటికి బాగా అవసరమైతేనే తప్ప జేబులకెంచి పైసలు తీస్తలేరు. మొత్తంగా తిండి, సామాను ,కాయగూరలు ,మందులు తప్ప ఏమీ కొంటలేరు .ఇవి తప్ప మిగతావి ఏవి కొనాలన్నా..ఒకటికి రెండు సార్టు ఆలోచిస్తున్నరు. దీంతో కిరాణ షాపులు, సూపర్ మార్కెట్లు కళకళలాడుతుంటే ..షాపింగ్ మాల్స్ ,ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్మే షాపులు వెలవెలబోయి కనిపిస్తున్నాయి. వీలైనంత వరకూ పైసల్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టాలని జనం డిసైడ్ అయినందుకే ఈ  పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. ఒక ప్రముఖ సర్వే సంస్థ చేసిన స్టడీ ప్రకారం.. కిరాణా షాపులు, సూపర్‌‌‌‌‌‌ ‌‌మార్కెట్లలో సరుకుల అమ్మకాలు 53 శాతం పెరిగాయి. మెకిన్సే అనే మార్కెటింగ్‌ సర్వే సంస్థ కూడా కిరాణా అమ్మకాలు 39 శాతం పెరిగాయని చెప్పింది. తమ ప్రొడక్టుల కు వంద శాతం ఆర్డర్లు వస్తున్నా వర్కర్ల కొరతతో డిమాండ్‌ను అందుకోలేకపోతున్నామని పార్లే సంస్థ ప్రతినిధి చెప్పారు. దేశంలో అన్ని చోట్లా ఇంచుమించు ఇదే ట్రెండ్‌ ఉన్నట్లు ఇతర కన్జూమర్‌‌‌‌‌‌‌‌ సర్వే సంస్థలు కూడా చెబుతున్నాయి.

గ్రోసరీలకే 52%ఖర్చుచేస్తున్నరు..

జనం తమ ఆదాయంలో 52 శాతం గ్రోసరీల మీదనే ఖర్చు చేస్తున్నారని డెలాయిట్‌‌‌‌‌‌‌‌ గ్లోబల్‌‌‌‌‌‌‌‌ కన్జూమర్‌‌‌‌‌‌‌‌ ట్రాకర్‌‌‌‌‌‌‌‌చేసిన సర్వేలో తేలింది. ఇందులో 72 శాతం లోకల్ గా, తమ ఇంటికి దగ్గరగా ఉండే కిరాణా షాపుల్లోనే కొనుగోలు చేస్తున్నారని వెల్లడైంది. సూపర్‌‌‌‌‌‌‌‌మార్కెట్లలో కూడా కొనుగోళ్లుపెరిగాయి. ‘‘లాక్‌‌‌‌‌‌‌‌ డౌన్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌లో మొదటి రెం డు నెలలు మాసేల్స్‌‌‌‌‌‌‌‌50 శాతానికి పడిపోయాయి. కానీ మెల్లగా ఇంప్రూవ్‌‌‌‌‌‌‌‌అయి, పాత పొజీషన్‌‌‌‌‌‌‌‌కు వచ్చేసింది. రైస్‌‌‌‌‌‌‌‌, దాల్‌‌‌‌‌‌‌‌ఎక్కువగా కొంటున్ నారు. దాదాపు ప్రతి కస్టమర్‌‌‌‌‌‌‌‌లిస్ టులో డ్రైఫ్రూట్స్‌‌‌‌‌‌‌‌కంపల్సరీ ఉంటున్నాయి. ఫ్రెష్‌ ఫ్రూట్స్‌‌‌‌‌‌‌‌కూడా ఎక్కువే కొంటున్నారు. దాంతో బిల్లింగ్‌ పెరుగుతోం ది’’ అని హెరిటేజ్‌‌‌‌‌‌‌‌స్టోర్‌‌‌‌‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌ ఒకరు చెప్పారు. శానిటైజర్లు, ఫ్లోర్‌‌‌‌‌‌‌‌ క్లీనరక్లీ అమ్మకాలు కూడా పెరిగాయని ఆయన తెలిపారు. సైనిక్‌‌‌‌‌‌‌‌పురిలో హోల్‌‌‌‌‌‌‌‌సేల్‌‌‌‌‌‌‌‌గా కిరాణా సామాను అమ్మే దేవా మాట్లాడుతూ.. ‘‘కరోనాకు ముందు నా డైలీ కౌంటర్‌‌‌‌‌‌‌‌రూ. 3, 3.5 లక్షలు ఉండేది. ఇపుడు రూ.2.8 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఉంటోంది. బియ్యం సేల్స్‌‌‌‌‌‌‌‌బాగా పెరిగాయి’’ అని చెప్పారు. గతంలో రోజుకు 5 నుంచి 10 కిలోల డ్రైఫ్రూట్స్‌ ‌‌‌‌‌‌‌అమ్మే వాడిననీ, ఇపుడు 15 కిలోలకు తగ్గకుండా సేల్‌ ‌‌‌‌‌‌‌అవుతోందన్నారు. ఇక ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో నిత్యావసర సరుకుల సేల్స్ వాటా 2017లో 1 శాతంగా ఉంటే.. 2019 నాటికి అది 1.9 శాతానికి పెరిగింది. కరోనా ఎఫెక్ట్ తో ప్రస్తుతం అది ఒక్కసారిగా 4 నుంచి 5 శాతానికి ఎగబాకిందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.

మందులు అడ్వాన్స్ గా కొంటున్నరు..

అన్‌‌‌‌‌‌‌‌లాక్‌‌‌‌‌‌‌‌ తర్వాత కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటంతో జనంలో భయం మొదలైంది. సీజనల్‌‌‌‌‌‌‌ డిసీజెస్‌‌‌ ‌‌‌‌‌వచ్చిన వాళ్లుకూడా కరోనా అని భయపడుతున్నారు. దీంతో మెడికల్‌‌‌‌‌‌‌‌షాపులకు పరుగులు పెడుతున్నారు. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో మందుల కొనుగోలు కూడా ఎక్కువైంది. రోగం వచ్చినా, రాకపోయినా మందులు కొనిపెట్టుకునే వాళ్లసంఖ్య పెరిగింది. కొంతమంది కరోనా మందులను అడ్వాన్స్ గా కొంటున్నారు. దీంతో మందుగోళీలకు వంద శాతం డిమాండ్‌ ఏర్పడింది. కొన్ని రకాల మందులకు 104 శాతం డిమాండ్‌ సైతం ఉందని ఫార్మాఈజీ అనే ఇ-ఫార్మసీ ప్రతినిధి ఒకరు చెప్పారు. బీపీ, షుగర్‌‌‌‌‌‌‌‌, హార్ ప్రాబ‌‌‌్లమ్స్‌‌ ‌‌‌‌‌‌లాంటి డిసీజెస్‌‌‌‌‌‌‌‌ ఉన్న వారు మందులను అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌గా కొంటుం టే, ఫ్లూ, కోల్డ్‌‌‌‌‌‌‌‌, కఫ్‌లకు మెడిసిన్స్‌‌‌‌‌‌‌‌కొనేవారి సంఖ్యకూడా పెరిగింది. మార్చి తర్వాత కార్యాక్‌‌‌‌‌‌‌‌డి డ్రగ్స్‌‌‌‌‌‌‌‌అమ్మకాలు 18.8 శాతం, యాంటీ డయాబెటిక్‌‌‌‌‌‌‌‌మందులు 14.4 శాతం, రెస్పిరేటరీ డ్రగ్స్‌‌‌‌‌‌‌‌అమ్మకాలు 26 శాతం పెరిగాయి. అజిత్రోమైసిన్‌‌‌‌‌‌‌‌, ఎరిత్రో మైసిన్‌‌‌‌‌‌‌‌లాంటి యాంటీ బయాటిక్‌‌‌‌‌‌‌‌ల అమ్మకాలు 80 శాతం పెరిగాయి. విటమిన్‌‌‌‌‌‌‌‌సి, జింక్‌‌‌‌‌‌‌‌ ట్యాబెట్లు మార్కెట్లో అసలు దొరకని పరిస్థితి ఏర్పడింది. వీటికి తోడు థర్మామీటర్‌‌‌‌‌‌‌‌, పల్స్‌‌‌‌‌‌‌‌ ఆక్సీ మీటర్‌‌‌‌‌‌‌‌, గ్లూకో మీటర్‌‌‌‌‌‌‌‌, బీపీ మిషన్‌‌‌‌‌‌‌‌, నెబ్యులైజరను కొన్ని ఇంట్లో పెట్టుకునేవారు కూడా ఎక్కువవుతున్నారు. దీనికి తగ్గట్టు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో మందులు అమ్మే స్టార్టప్ ‌‌‌‌‌‌‌కొత్తగా 50 వరకు పుట్టుకొచ్చాయి. 2022 నాటికి ఇ-ఫార్మసీల వ్యాపారం 7 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

ఎలక్ట్రానిక్స్ షోరూమ్స్ పరిస్థితి ఇలా..

కరోనాకు ముందుతో పోల్చితే సేల్స్ తగ్గాయి .గడిచిన రెండు నెలలుగా మార్కెట్ కొంత పెరిగింది. లాస్ట్4 నెలల్లోసేల్స్ 40% నుంచి 80%కి పెరిగాయి. – హోమ్ అప్లియన్స్, స్మాల్ అప్లియన్స్ కు గిరాకీ ఎక్కువగా ఉంది. – పని మనుషుల కొరత వల్ల డిష్వాషర్, వాషింగ్‌‌మెషీన్లకు డిమాండ్ పెరిగింది.

క్లాత్ బిజినెస్ ఇట్లుంది..

సేల్స్ పూర్తిగా పడిపోయాయి. బ్రాండెడ్క్లాత్స్ సేల్స్ అసలే లేవు-. నెలలో ఒక వారం రోజులు జీరో సేల్స్ ఉంటున్నాయి. నార్మల్ గా వాడే బట్టలను మాత్రమే జనం ఎక్కువగా కొంటున్నారు.

ఇన్సూరెన్స్ గురించి అడుగుతున్నరు..

కరోనా ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కి అయ్యే ఖర్చు గురించి చాలామంది భయపడుతున్నారని ఇన్సూరెన్స్‌‌ ఏజెంట్‌‌‌‌‌‌‌‌ శివరామ్‌‌‌‌‌‌‌‌ చెప్పారు.‘‘అందుకే ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌ ప్యాకేజీల గురించిఅడుగుతున్నారు. అవిహాస్పిటళ్లలో చెల్లుతాయా? అని ఎంక్వయిరీ చేస్తున్నారు. ఎందుకైనా మంచిదని డబ్బులు పొదుపుచేసుకుంటున్నారు’’ అని ఆయన తెలిపారు.

ఆఫర్లు పెట్టినారావడంలేదు

ఆషాఢం, జులైలో ఎండ్ ఆఫ్ ద సీజన్ సేల్ నడుస్తుంది. ఇప్పుడు ఆ ఆఫర్స్ పెట్టి నా ఎవరూ రావడం లేదు. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో కొనేందుకునే ఇంట్రెచిన్న స్టోర్స్ క్లోజింగ్ ఆలోచనలో ఉన్నాయి.
– వీనస్,మేనేజర్,మంజీరా మాల