
స్వామి అయ్యప్ప దర్శనానికై శబరిమల వెళుతున్న మహిళ హక్కుల నేత బిందుపై ఓ గుర్తు తెలియని వ్యక్తి పెప్పర్ స్ప్రే తో దాడి చేశాడు. ఈ ఘటన మంగళవారం ఉదయం ఎర్నాకుళం పోలీస్ కమీషనర్ ఆఫీస్ ఎదుట జరిగింది. ఈ ఏడాది జనవరిలో తోటి మహిళ హక్కుల నేత తృప్తి దేశాయ్ తో కలసి బిందు శబరిమల అయ్యప్ప దర్శనం చేసుకొంది. ఈ సారి కూడా స్వామి దర్శనం కోసం శబరిమల వెళ్లాలని, అందుకు రక్షణ కల్పించాల్సిందిగా ఎర్నాకుళం పోలీస్ కమీషనర్ ను ఆశ్రయించింది. ఈ విషయం తెలుసుకున్న శ్రీనాథ్ పద్మనాభన్ అనే వ్యక్తి ఆఫీస్ నుంచి బయటికి వచ్చిన బిందుపై పెప్పర్ స్ప్రే తో దాడి చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించి, దాడికి పాల్పడ్డ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
Man from #sabarimala devotee group uses pepper spray against Bindhu ,who was planning to go to #sabarimalatemple along with women activist #TruptiDesai,incident happened outside the Kochi Commissioner office!
They are strong about going to temple and protests are on already! pic.twitter.com/0hbXIUGyv3
— Sanjeevee sadagopan (@sanjusadagopan) November 26, 2019