
హైదరాబాద్, వెలుగు : ఈ–కామర్స్ ఫర్నిచర్, హోం అప్లియెన్సెస్ కంపెనీ పెప్పర్‌ఫ్రై హైదరాబాద్ లో మూడు కొత్త స్టూడియోలను ప్రారంభించింది. ఈ ఆఫ్‌లైన్ వ్యాపారాన్ని మరింత పెంచడానికి, మరిన్ని మార్కెట్‌లలో విస్తరించడానికే ఈ ప్రయత్నమని తెలిపింది. ఫర్నిచర్, హోం ప్రొడక్టుల విభాగంలో అతిపెద్ద ఓమ్నీ ఛానెల్ వ్యాపారాన్ని సృష్టిస్తామని పెప్పర్‌ఫ్రై తెలిపింది.
సంస్థకు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 100కు పైగా నగరాలలో 200కు పైగా స్టూడియోలు ఉన్నాయి. ప్రస్తుతం ఇది 90కు పైగా పార్టనర్లతో కలిసి పనిచేస్తోంది. హైదరాబాద్ లోని అత్యంత కీలకమైన వాణిజ్య ప్రాంతాలు కోకాపేట , అత్తాపూర్, కూకట్‌పల్లిలో స్టూడియోలను ఏర్పాటు చేసింది.