న్యూ ఇయర్ వేడుకలకు పర్మీషన్ మస్ట్ : పోలీస్ కమిషనర్

న్యూ ఇయర్ వేడుకలకు పర్మీషన్ మస్ట్ : పోలీస్ కమిషనర్

హైదరాబాద్ నగరంలో సన్ బర్న్ లాంటి ఇంటర్నేషనల్ పార్టీ ఈవెంట్స్ పై పోలీసులు  ఫోకస్ పెట్టారు. సన్ బర్న్ లాంటి ఈవెంట్స్ లో డ్రగ్స్ వాడుతున్నారనే ఆరోపణలు నేపథ్యంలో డిసెంబర్ 25వ తేదీ ఆదివారం సచివాలయంలో జరిగిన సమావేశంలో  సన్ బర్న్ లాంటి ఈవెంట్స్ పై స్ట్రిక్ట్ గా ఉండాలని  సీఎం రేవంత్ రెడ్డి పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసు అధికారులు ఇలాంటి ఇంటర్నేషనల్ పార్టీ ఈవెంట్స్ నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. 

ఈసారి న్యూ ఇయర్ కి సన్ బర్న్ కి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని సీపీ అవినాష్ మహంతి తెలిపారు. ఇప్పటివరకు సన్ బర్న్ ఈవెంట్ కోసం ఎలాంటి దరఖాస్తు రాలేదని చెప్పారు. అనుమతి తీసుకోకుండా.. ఆన్ లైన్ లో టికెట్లు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకుంటామని.. బుక్ మై షో ప్రతినిధులను పిలిచి హెచ్చరించినట్లు తెలిపారు. న్యూ ఇయర్ ఈవెంట్ల కోసం ఎవరైనా అనుమతులు తీసుకోవాల్సిందేనని సీపీ స్పష్టం చేశారు.