
వరంగల్ సిటీ, వెలుగు: గ్రేటర్ వరంగల్ పరిధిలో ఫేక్సర్టిఫికెట్ల తయారీ కేసులో 9 మందిని అరెస్ట్ చేసినట్లు మట్టెవాడ సీఐ గోపి తెలిపారు. వరంగల్ వేణురావు కాలనీలో హనుమాన్ ఆన్లైన్ సెంటర్ నిర్వహిస్తున్న నల్లబెల్లి అమరేందర్ కొంతమంది ఏజెంట్లను పెట్టుకొని ప్రజలకు నకిలీ ఆధార్ కార్డులు, బర్త్, డెత్, రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు తయారు చేసి ఇచ్చాడు. పోలీసులు పక్కా ఆధారాలతో ఇదివరకే అమరేందర్ ను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపించారు.
అతని వద్ద ఏజెంట్లుగా పని చేసిన 9 మంది నర్సంపేటకు చెందిన జూలూరి ప్రభాకర్, గోపాల స్వామి గుడి ప్రాంతానికి చెందిన కొన్ని సురేశ్‌కుమార్ , పరకాలకు చెందిన వేముల రాజేందర్, హనుమకొండ పద్మాక్షి కాలనీకి చెందిన గొల్లపల్లి శశికాంత్, భూపాలపల్లికి చెందిన సంకరమైన సాగర్ , హన్మకొండ జిల్లా నక్కలగుట్టకు చెందిన నీరటి రాజేశ్, నల్లబెల్లి మండలానికి చెందిన నాగపురి లిఖిత్ కుమార్ , చింతల్‌కు చెందిన మహేందర్, వరంగల్ ఎల్లంబజార్‌కు చెందిన ఎండీ.జుబేర్ ను గురువారం పోచం మైదాన్ కార్ల అడ్డా వద్ద అరెస్ట్ చేసినట్లు సీఐ పేర్కొన్నారు.