
బీఎండబ్ల్యూ ఇండియా రెండో తరం బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపేను ఇండియాలో రూ.46.90 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ కారు చెన్నైలోని కంపెనీ ప్లాంట్‌లో తయారవుతోంది.
ఈ ఎంట్రీ-లెవల్ సెడాన్ రెండు పెట్రోల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. బీఎండబ్ల్యూ 218 ఎం స్పోర్ట్ ధర రూ.46.90 లక్షలు కాగా, బీఎండబ్ల్యూ 218 ఎం స్పోర్ట్ ప్రో ధర రూ.48.90 లక్షలు (రెండూ ఎక్స్‌షోరూమ్ ధరలు). వీటిలో 1.5-లీటర్, 3-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు.
ఇది 156 హెచ్‌పీ పవర్, 230 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కార్లు గంటకు వంద కిలోమీటర్ల స్పీడ్‌ను 8.6 సెకన్లలో అందుకుంటాయి. టాప్ స్పీడ్ 230 కి.మీ/గంటకు.