మాలలకు జరుగుతున్న అన్యాయంపై ఉద్యమిస్తాం : మందాల భాస్కర్

మాలలకు జరుగుతున్న అన్యాయంపై ఉద్యమిస్తాం : మందాల భాస్కర్

సూర్యాపేట, వెలుగు:  రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ, రోస్టర్ విధానంతో గ్రూప్ –3గా విభజించిన మాల సామాజిక వర్గానికి పూర్తిగా అన్యాయం జరుగుతుందని మాల సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ మందాల భాస్కర్  ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  

ఎస్సీ వర్గీకరణతో మాల విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు జరుగుతున్న నష్టాన్ని సవరించాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. త్వరలో లక్షలాది మందితో ‘ చలో హైదరాబాద్’ నిర్వహిస్తామన్నారు. మాల సంఘాల జేఏసీ నేతలు పాల్గొన్నారు.