పోలీస్ స్టేష‌న్ ముందు పురుగుల మందు తాగి వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌

పోలీస్ స్టేష‌న్ ముందు పురుగుల మందు తాగి వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా: పోలీస్ స్టేష‌న్ ముందు పురుగుల మందు తాగి ఓ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌ చేసుకున్నాడు. ఈ విషాద‌ సంఘ‌ట‌న శ‌నివారం జ‌య‌శంక‌ర్ జిల్లాలో జ‌రిగింది. జిల్లాలోని చిట్యాల మండల కేంద్రంలోని స్థానిక పోలీస్‌స్టేషన్ కు ఓ కేసు విష‌యంపై ఎండీ మహమ్మద్‌ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఫ్యామిలీ కౌన్సిలింగ్ కు వచ్చాడు. అయితే.. లోపలికి వెళ్లక ముందే గేటు బయట అతడు పురుగుల మందు తాగాడు. లోపలికి వెళ్లగానే స్టేషన్ లో స్పృహతప్పి పడిపోయాడు.

పోలీసులు మహమ్మద్‌ను వెంట‌నే స్థానిక సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. హాస్పిట‌ల్ లో చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మ‌హ‌మ్మ‌ద్ ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది.