సర్పంచ్ ఎన్నికల్లో ఎన్నికలను బహిష్కరిస్తున్న ఘటనలు అక్కడక్కడా వెలుగు చూస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో ఒక్క ఓటు కూడా లేని కమ్యూనిటీలకు రిజర్వేషన్లు రావడంతో ఈ పరిస్థితి నెలకొంది.
నల్లగొండ జిల్లా పేరూరు గ్రామంలో కూడా ఇదే పరిస్థితి ఉండటంతో ఒక్క నామినేషన్ కూడా వేయలేదు గ్రామస్తులు.
గ్రామంలో ఎస్టీ ఓటర్లు లేకున్నా.. గ్రామ సర్పంచ్ వార్డులు ఎస్టీకి రిజర్వ్ కావడం తో పంచాయతీ కోర్టుకెక్కింది. అనుముల మండలం పేరూరు గ్రామం గ్రామపంచాయతీ ఎన్నికలను బహిష్కరించానే గ్రామస్థులు. గ్రామంలో కేవలం ఒక్కరే ఎస్సీ అభ్యర్థి (పురుషుడు)ఉండడం తో గ్రామస్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటుగా గ్రామపంచాయతీ లో 8 వార్డులు ఉండగా వాటిలో నాలుగు వార్డులు ఎస్టీకి రిజర్వ్ కావడంతో ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
