సాదుకుందమని తెచ్చిన కుక్క బిడ్డ పాణం తీసింది

సాదుకుందమని తెచ్చిన కుక్క బిడ్డ పాణం తీసింది
  • ఇంగ్లాండ్​లో ఘోరం

లండన్: ఇంట్లో పెంచుకుందామని ఓ కుక్కను తెచ్చుకుందో జంట.. అందరికీ అలవాటు చేయడానికి ప్రయత్నిస్తున్నరు. వారం రోజులు గడిచినంక ఘోరం జరిగింది. పదిహేడు నెలల పసికందుపై ఆ కుక్క దాడి చేసింది. దాని నుంచి విడదీసి పాపను ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం దక్కలే. ట్రీట్​మెంట్​ తీసుకుంటూ ఆ బిడ్డ చనిపోయింది. ఇంగ్లాండ్​లోని మెర్సీసైడ్​ కౌంటీలో జరిగిందీ దారుణం.. కౌంటీలో కాపురముండే ఓ జంటకు ఇద్దరు పిల్లలు. చిన్న పాప బెల్లా రే బిర్చ్​కు ఇప్పుడు 17 నెలలు. తప్పటడుగులతో ఇల్లంతా తిరుగుతూ సందడి చేసేది.. సోమవారం ఇంట్లో ఆడుకుంటున్న పాపపై కుక్క దాడి చేసింది. వెంటనే తేరుకున్న బిర్చ్​ పేరెంట్స్.. ఆ కుక్కను అదిలించి, బిర్చ్​ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా, ఆ కుక్కను బిర్చ్​ పేరెంట్స్ వారం రోజుల కిందటే కొనుక్కొచ్చారు. ఈ విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు కుక్కను తీసుకెళ్లి చంపేశారు. అది ఏ బ్రీడ్ కుక్కనో తెలుసుకునేందుకు 
ఫోరెన్సిక్ టెస్టులకు పంపారు.