దటీజ్ కుక్క .. పాప ప్రాణం కాపాడింది.

దటీజ్ కుక్క .. పాప ప్రాణం కాపాడింది.

విశ్వాసానికి మారు పేరు ఏంటని అడిగితే చాలా మంది నోటి నుంచి వచ్చే సమాధానం కుక్క. ఈ సమాధానంపై గతంలో జరిగిన ఉదాహరణలు ఎన్నో.  తాజాగా కుక్క విశ్వాసాన్ని తెలియజేసే ఘటన ఒకటి జరిగింది. ఏ ప్రాంతంలో జరిగిందో తెలియదు కానీ అందుకు సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట్లో చక్కర్లు కొడుతొంది.

నది ఒడ్డున ఆడుకుంటున్న ఓ చిన్నారి.. తన బంతి నీటిలో పడడంతో దానిని తెచ్చుకునే ప్రయత్నం చేసింది. ప్రక్కనే ఉన్న ఆ బాలిక పెంపుడు కుక్క జరగబోయే ప్రమాదాన్ని ఊహించి బంతి తీసేందుకు ప్రయత్నిస్తున్న బాలిక దగ్గరకు పరుగున వెళ్లి గౌను పట్టి వెనక్కి లాగింది.  ఆ తర్వాత నదిలో పడ్డ బంతిని చిన్నారి కోసం బయటకు తెచ్చింది. ఈ ఘటన కు సంబంధించిన వీడియోను ఫిజిక్స్-అస్ట్రానమి.ఆర్గ్ అనే పేరు గల ట్విటర్ అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కుక్కకు మించిన విశ్వాసం కల ప్రాణి మరేదీ లేదంటున్నారు నెటిజన్లు.