ప్రేమగా చూడమని చెబితే.. మా కుక్కలనే కొడతారా..

ప్రేమగా చూడమని చెబితే.. మా కుక్కలనే కొడతారా..

పెట్ గ్రూమింగ్.. ఇటీవల కొత్తగా వచ్చిన ట్రెండ్.. కుక్కలకు స్నానం చేయించటం.. కుక్కల జుట్టును  బాగు చేయటం.. వాటి ఆలనాపాలనా చూడటం అన్నమాట.. అలాంటి పెట్ గ్రూమింగ్ సిబ్బంది.. కుక్కలను కొడుతున్నారంట.. దీనిపై యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా కుక్కలను మా బిడ్డలకు ఎంతో చక్కగా పెంచుకుంటున్నాం.. కన్న బిడ్డల కంటే ఎక్కువగా సాకుతున్నాం.. అలాంటి కుక్కలను కొడతారా అంటూ గగ్గోలు పెడుతున్నారు. దీనిపై కేసు కూడా పెట్టారు. ఈ వివరాలే ఇప్పుడు పూర్తిగా చూద్దాం...

మహారాష్ట్రలోని థానేలోని ఆర్ మాల్ కు సమీపంలో ఉన్న వెటిక్ పెట్ క్లీనిక్ గ్రూమింగ్ సెంటర్ లో ఓ కుక్కను అక్కడ ఉన్న సిబ్బంది దారుణంగా కొట్టారు. కొట్టిన వీడియోను సోషల్ మీడియాలోకి వదిలారు. ఇంకేముంది ఆ వీడియో కాస్త క్షణాల్లోనే వైరల్ గా మారింది. వీడియోలో కుక్కను కొట్టండం చూసిన జంతు ప్రేమికులకు భయాందోళనకు గురిచేసింది.

 తాము ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న కుక్కను అంతే జాగ్రత్తగా చూసుకుంటారని గ్రూమింగ్ సెంటర్లకు పంపిస్తే అక్కడ చేసే నిర్వాకం ఇదా అని కామెంట్ చేస్తున్నారు. పెంపుడు తల్లిదండ్రులుగా, వారు తమను బాగా చూసుకుంటారనే ఆలోచనతో పంపినప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు. జంతువులపై క్రూరత్వానికి కఠినమైన శిక్షలు విధించాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.

ఘటన పై స్పందిస్తున్న సెలబ్రెటీలు 

గ్రూమింగ్ సెంటర్‌లో సిబ్బంది పెంపుడు కుక్కను కొట్టిన వీడియో పై సెలబ్రెటీలు స్పందిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్స్ వరుణ్ ధావన్, ప్రతీక్ బబ్బర్, అలీ గోని వంటి ప్రముఖులు ఈ వీడియోను చూసి గరం అయ్యారు. వారి పై చర్యలు తీసుకోవాలని కోరారు. క్లినిక్ మరియు దాని సంబంధిత సిబ్బందిపై తక్షణమే మరియు కఠిన చర్యలు తీసుకోవాలని ప్లాంట్ అండ్ యానిమల్స్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకుడు నీలేష్ భానాగే డిమాండ్ చేశారు. జిల్లా కమిషనర్‌కు లేఖ ఈ ఘటన పై రాశారు.  

క్లినిక్‌లోని క్రూరత్వాన్ని ప్రస్తావిస్తున్న సిబ్బంది పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా, పెంపుడు జంతువుతో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు ఉద్యోగులను వెటిక్ పెట్ క్లినిక్ యజమాని గౌరవ్ అజ్మీరా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు.

Also Read: ఏసుక్రీస్తు రూపంలో సరస్వతిదేవి విగ్రహం