
- చితకబాదిన తల్లిదండ్రులు
- పోలీస్ స్టేషన్లో కంప్లయింట్
- ప్రిన్సిపాల్, పీఈటీ సస్పెన్షన్
నారాయణ్ ఖేడ్, వెలుగు : ఓ పీఈటీ టెన్త్ క్లాస్ స్టూడెంట్‌తో అసభ్యంగా ప్రవర్తించడంతో వారి పేరెంట్స్, గ్రామస్తులు చితకబాదారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపుర్ జడ్పీహెచ్ఎస్ స్కూల్ లో సంగ్రామ్ పీఈటీగా పని చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం స్కూల్ ప్రారంభమైన తర్వాత ఓ టెన్త్ క్లాస్ అమ్మాయిని బిల్డింగ్‌పైకి తీసుకువెళ్లాడు. అక్కడ మీద చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించడంతో కింది నుంచి తోటి విద్యార్థులు గమనించారు.
విషయాన్ని స్టూడెంట్స్‌తో పాటు సదరు విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో అక్కడికి వచ్చిన వారు గ్రామస్తులతో కలిసి సంగ్రామ్ ను చితకబాది పీఎస్‌లో కంప్లయింట్ చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న డీఈవో వెంకటేశ్వర్లు ప్రిన్సిపాల్ గురునాథ్ తో పాటు పీఈటీని సస్పెండ్ చేశారు.