సలహాదారుగా శివధర్‌‌‌‌ రెడ్డి నియామకం చెల్లదు..హైకోర్టులో పిటిషన్‌‌‌‌ దాఖలు

సలహాదారుగా శివధర్‌‌‌‌ రెడ్డి నియామకం చెల్లదు..హైకోర్టులో పిటిషన్‌‌‌‌ దాఖలు

హైదరాబాద్, వెలుగు: పదవీ విరమణ చేసిన ఐపీఎస్‌‌‌‌ అధికారి బి. శివధర్‌‌‌‌ రెడ్డిని రాష్ట్ర భద్రతా సలహాదారుగా నియమించడం చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్‌‌‌‌ దాఖలైంది. ప్రకాశ్‌‌‌‌సింగ్‌‌‌‌ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా శివధర్‌‌‌‌ రెడ్డిని తాత్కాలిక డీజీపీగా నియమించడాన్ని సవాల్‌‌‌‌ చేస్తూ ధనగోపాల్‌‌‌‌రావు వేసిన పిటిషన్‌‌‌‌లోనే మరో మధ్యంతర పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు.

శివధర్‌‌‌‌ రెడ్డి పదవీ విరమణకు ముందు రోజు భద్రతా సలహాదారుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌‌‌‌ 29న జారీ చేసిన జీవో 559ను సవాల్‌‌‌‌ చేస్తూ ఈ పిటిషన్‌‌‌‌ వేశారు. శివధర్‌‌‌‌ రెడ్డిని సలహాదారుగా నియమించడం చట్టవిరుద్ధమని, జీవో అమలును నిలిపివేయాలని కోరారు.