
రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కల బెడద ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిందే. ఒంటరిగా తిరుగుతున్న చిన్న పిల్లల ప్రాణాలు తీస్తున్నాయి. రోడ్డుపై వెళ్లేవాళ్లపై దాడి చేస్తున్నాయి. ప్రజలు వీటినుంచి కాపాడాలని అధికారులకు ఎన్ని సార్లు వినతి పత్రాలు ఇచ్చినా.. సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. అందుకే ప్రజలే వినూత్న ఆలోచన చేశారు. వీధి కుక్కలకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
‘డియర్ వీధి కుక్కలు.. ప్రజలను మీరు కరవడం వల్ల ప్రాణాలు పోతున్నాయి. మిమ్మల్ని కట్టడి చేయాలని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మీరైనా దయచేసి అర్థం చేసుకొని మమ్మల్ని కరవకండి’ అంటూ వినతి పత్రాన్ని విడుదల చేశారు. ఇలా ప్రభుత్వ పని తీరుపై తమ అసహనాన్ని వెల్లబుచ్చారు.