
లాక్ డౌన్ సమయంలో ఫ్రీగా కాలింగ్, డేటా, టీవీ సర్వీసులు అందించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రజలకు మొబైల్, టీవీ సర్వీసులు ఉచితంగా అందించాలని పిటిషన్ వేసిన మనోహార్ ప్రతాప్ అనే వ్యక్తి .. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ సహా ఇతర వీడియో స్ట్రీమింగ్ వెబ్ సైట్లు ఫ్రీగా అందించాలని గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. వీటిని ఫ్రీగా ఇవ్వడం వల్ల ప్రజల మానసిక ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు మనోహార్ ప్రతాప్.