కాలనీ సమీపంలో ఎస్టీపీ నిర్మించొద్దు : శ్రీనిధి కాలనీ వాసులు

కాలనీ సమీపంలో ఎస్టీపీ నిర్మించొద్దు : శ్రీనిధి కాలనీ వాసులు
  •     ఎమ్మెల్సీ అంజిరెడ్డికి వినతిపత్రం అందజేత 

అమీన్​పూర్, వెలుగు: తమ కాలనీ సమీపంలో ఎస్టీపీ నిర్మాణం చేపట్టొద్దని అమీన్​పూర్​ మున్సిపల్​ పరిధిలోని శ్రీనిధి కాలనీ వాసులు ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరిని కోరారు. మంగళవారం ఎమ్మెల్సీని ఆయన నివాసంలో కలిసి వినతి పత్రాన్ని అందజేసి సమస్యను వివరించారు. 

కాలనీకి అతి సమీపంలో ఎస్టీపీ నిర్మాణానికి స్థలాన్ని ప్రతిపాదించారని, ఇది ఏర్పాటు చేస్తే నిత్యం శబ్ధాలు, కంపు వాసన వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమీప ప్రజల ఆరోగ్యానికి నష్టం చేకూరుస్తుందన్నారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో ప్రతాప్​రెడ్డి, వెంకట్, శరత్, శ్రీకాంత్​రెడ్డి, హరి, సుదర్శన్​, వెంకటేశ్వరరావు, శ్రీరామ్, రామ్మోహన్, ప్రపుల్​చౌదరి పాల్గొన్నారు.