న్యూఢిల్లీ: వరుసగా నాలుగో రోజు కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. పెట్రోల్ ధర లీటరుకు 28 పైసలు, లీటరు డీజిల్‌పై 31 పైసలు పెంచాయి. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ రేటు రూ .91.27లకు, డీజిల్ ధర లీటరుకు రూ .81.73లకు చేరింది. యా ప్రభుత్వాలు విధించే వ్యాట్ బట్టి రాష్ట్రాల వారీగా ధరలు మారుతూ ఉంటాయి. రాజస్థాన్‌లో గగన్నగర్లో వ్యాట్ ఎక్కువగా ఉండటంతో అక్కడ లీటరు పెట్రోల్ రేటు రూ.102.15లకు చేరింది. ఢిల్లీలో పెట్రోల్ ధరలో కేంద్ర ప్రభుత్వం లీటరుకు రూ .32.98 చొప్పున, రాష్ట్ర ప్రభుత్వం రూ .19.55 చొప్పున వ్యాట్ వసూలు చేస్తున్నాయి. డీజిల్‌పై వరుసగా రూ. 31.83 చొప్పున, రూ .10.99 చొప్పున వ్యాట్ వేస్తున్నారు. పెట్రోల్‌పై లీటరుకు కనీసం రూ .2.6, డీజిల్‌పై రూ .2 చొప్పున డీలర్‌కు కమీషన్ ఇస్తారు.
