వాహనదారులకు షాక్.. పెట్రోల్‌పై రూ. 2.5, డీజిల్‌పై రూ. 4 సెస్

వాహనదారులకు షాక్.. పెట్రోల్‌పై రూ. 2.5, డీజిల్‌పై రూ. 4 సెస్

మరింత పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

ఇప్పటికే భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనాదారులు బెంబెలెత్తుతున్నారు. తాజాగా పెట్రోల్, డీజిల్‌పై సెస్‌ను పెంచనున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. లీటర్ పెట్రోల్‌పై రూ. 2.50 పైసలు, లీటర్ డీజిల్‌పై రూ. 4 వ్యవసాయ సెస్ విధించనున్నట్లు ప్రకటించారు. దాంతో పలు రాష్ట్రాల్లో పెట్రోల్ రేటు వందకు చేరనుంది. కేంద్ర నిర్ణయంతో సామాన్యులకు భారీ షాక్ ఇచ్చినట్లైంది. పెట్రోల్, డీజిల్ సుంకాల పెంపుతో కూరగాయలు, నిత్యావసరాల ధరలు కొండెక్కనున్నాయి.