పండుగపూట పెట్రో మంట.. వరుసగా నాలుగో రోజు బాదుడు

పండుగపూట పెట్రో మంట.. వరుసగా నాలుగో రోజు బాదుడు

న్యూఢిల్లీ: దేశంలో పెట్రో ధరల మంట కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజూ పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ కంపెనీలు పెంచాయి. పెట్రోల్‎పై 31 పైసలు, డీజిల్‎పై 38 పైసల చొప్పున పెరిగింది. దాంతో హైదరాబాద్‎లో లీటరు డీజిల్  100 రూపాయల 51 పైసలకు, పెట్రోలు 107 రూపాయల 73 పైసలకు చేరింది. దేశరాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్  103 రూపాయల 54 పైసలకు, డీజిల్ 92 రూపాయల 12 పైసలకు పెరిగింది. ముంబైలో పెట్రోల్ 109 రూపాయల 54 పైసలకు, డీజిల్ 99 రూపాయల 22 పైసలకు చేరింది. కోల్‎కతాలో పెట్రోల్ 104 రూపాయల 23 పైసలకు, డీజిల్ 95 రూపాయల 23 పైసలకు పెరిగింది. రోజురోజుకూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండడంపై సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుడికి నిత్యావసరంగా మారిన టూవీలర్‎ను కూడా వాడుకోలేని పరిస్థితి వస్తోందని వాపోతున్నారు. పెట్రోల్, డీజీల్ మరియు గ్యాస్ ధరలు చూస్తుంటే దసరా పండుగ చేసుకోగలమా అని ఆవేదన చెందుతున్నారు.

For More News..

నేడు వరల్డ్‌ ఎగ్‌ డే: గుడ్డు ఈజ్​ గుడ్