బంకుల్లో మారిన రేట్లు.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

బంకుల్లో మారిన రేట్లు.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

లోక్ సభ ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్  ధరలను లీటరుకు రూ.2 చొప్పున కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. తగ్గిన ధరలు 2024 మార్చి 15 శుక్రవారం ఉదయం 6 నుంచి అమల్లోకి వచ్చాయి. పెట్రో ధరల తగ్గింపును పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్  సింగ్  పురీ ట్విటర్​లో వెల్లడించారు. 

హైదరాబాద్​లో రూ.109.66  ఉన్న లీటర్ పెట్రోల్​ ధర రూ.107.66కు చేరింది. రూ.97.82 ఉన్న డీజిల్​ ధర రెండు రూపాయలు తగ్గి 95.82కు చేరింది.